Skytrax World Airport Awards 2026: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) అంతర్జాతీయ వేదికపై మరోసారి తన సత్తా చాటింది. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్ (Skytrax) నుంచి ‘బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా & సౌత్ ఏషియా 2026’ (భారత్, దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది) అవార్డును కైవసం చేసుకుంది. విశేషమేమిటంటే, ఈ విమానాశ్రయానికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం ఇది ఐదోసారి.
Read Also: Azharuddin : అజహరుద్దీన్ మంత్రి పదవికి గండం!
లండన్ వేదికగా అవార్డుల ప్రకటన
లండన్‌లో నిర్వహించిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పో 2026 కార్యక్రమంలో ఈ అవార్డును అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించి, అత్యుత్తమ సేవలందించే విమానాశ్రయాలకు స్కైట్రాక్స్ ఈ గుర్తింపునిస్తుంది. సిబ్బంది ప్రయాణికులతో వ్యవహరించే తీరు, వారి స్నేహపూర్వక వైఖరి, వృత్తిపరమైన సేవల ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది.

అద్భుతమైన సేవలకు నిదర్శనం
చెక్-ఇన్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్, బోర్డింగ్ వంటి అన్ని విభాగాల్లో సిబ్బంది పనితీరును దీనికోసం పరిగణనలోకి తీసుకుంటారు.ఈ అవార్డుతో పాటు శంషాబాద్ విమానాశ్రయం మరికొన్ని ఘనతలను కూడా సాధించింది. భారత్, దక్షిణాసియాలో ‘రెండో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం’గా, నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: