తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ (Adilabad ) జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం ఆకస్మిక వర్షాలకు తోడు పిడుగుల (Lightning Strikes) బీభత్సం జనం ప్రాణాలను బలిగొంది. జిల్లాలోని బేల మండలంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనలో వ్యవసాయ పనులు చేస్తున్న నందిని (30), సునీత (35) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
గాదిగూడ మండలంలో గుడిసెలపై పిడుగు
గాదిగూడ మండలం పిప్పిరిలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ పొలాల్లో పని చేస్తున్న 14 మంది వర్షం రావడంతో సమీపంలోని గుడిసెలో ఆశ్రయం తీసుకున్నారు. అయితే అప్పటికే మేఘాలు అలముకున్న ఆకాశంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో గుడిసె పైకప్పు ధ్వంసమైంది. ఈ ఘటనలో సిడాం రాంబాయి, పెందూర్ మనోహర్, పెందూర్ సంజన, భీంబాయి అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రభుత్వ స్పందన అవసరం
ఈ విషాద ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయంతోపాటు అన్ని రకాల సాయం చేయాల్సిన అవసరం ఉంది. పిడుగుల వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల పరిస్థితి చూస్తే గుండెదెబ్బ తినకమానదు. ప్రస్తుత వర్షాకాలంలో రైతులు పొలాల్లో పని చేస్తున్న సమయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. పిడుగుల హెచ్చరికలు, రక్షణ చర్యలపై గ్రామస్థాయిలో అవగాహన పెంపొందించాలి.
Read Also : Boeing Shares Crash : ఫ్లైట్ ప్రమాదం.. అమెరికాలో బోయింగ్ షేర్లు భారీగా పతనం