📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

sirpur maoists arrest : సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. 16 మంది నక్సల్స్‌ అరెస్ట్…

Author Icon By Sai Kiran
Updated: December 17, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

sirpur maoists arrest : దేశవ్యాప్తంగా మావోయిస్టులపై భద్రతా బలగాల దృష్టి కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 16 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసు నిఘా విభాగం నుంచి అందిన పక్కా సమాచారంతో ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా 9 మంది మహిళలు, 7 మంది పురుషులు కలిపి 16 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. అరెస్టయిన వారిలో రాష్ట్ర స్థాయి కేడర్ కలిగిన బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్లు సమాచారం. జిల్లాలో మావోయిస్టుల చలనం తగ్గిందని భావిస్తున్న సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో అరెస్టులు జరగడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read also: TG Panchayat Elections: మూడవ విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఇదిలా ఉండగా, సుమారు 30 ఏళ్ల క్రితం (sirpur maoists arrest) అజ్ఞాతంలోకి వెళ్లిన తన కుమారుడు పోలీసులకు చిక్కాడన్న వార్త తెలిసి దామోదర్ తల్లి భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె, తన కుమారుడిని ప్రాణాలతో చూస్తానో లేదో అనే ఆందోళన ఎప్పుడూ ఉండేదని, పోలీసులకు దొరికాడన్న వార్త ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. తన కుమారుడిని తనకు అప్పగించాలని ఆమె పోలీసులను వేడుకున్నారు.

మరోవైపు, పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. అరెస్టయిన వారిని చట్టబద్ధంగా కోర్టులో ప్రవేశపెట్టాలని, వారి ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణరావు కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu kumram bheem asifabad news Latest News in Telugu maoist operation telangana maoists arrested telangana naxalites arrested india sirpur forest combing operation sirpur u forest news sirpur u maoists arrest telangana maoists news telangana police maoist arrest Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.