📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Sirikonda Madhusudhanachari: కేసీఆర్ కారణజన్ముడు.. త్వరలోనే ఆయనపై పుస్తకం రాస్తా

Author Icon By Anusha
Updated: August 16, 2025 • 1:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు వెలువడ్డాయి. తెలంగాణ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి (Sirikonda Madhusudhanachari) మాట్లాడుతూ, “కేసీఆర్ ఒక కారణజన్ముడు. ఆయన జీవితమే ఒక చరిత్ర. త్వరలోనే ఆయన్ని కేంద్రంగా చేసుకొని నేను కూడా ఒక పుస్తకం రాస్తాను” అని వెల్లడించారు.తాజాగా తెలంగాణ భవన్‌లో ‘ప్రజాయోధుడు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహేంద్ర తోటకూరి రచించిన ఈ పుస్తకం పూర్తిగా కేసీఆర్ జీవితానికి అంకితమైంది. ఈ కార్యక్రమానికి మధుసూదనాచారి హాజరై, కేసీఆర్ సాధించిన విజయాలను స్మరించుకున్నారు. “ఈ పుస్తకం చాలా బాగుంది, చదివిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్ జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది” అని ఆయన ప్రశంసించారు.

తెలంగాణ ప్రజల్ని ఒక్క తాటిపైకి తెచ్చి

మధుసూదనాచారి మాట్లాడుతూ, “తెలంగాణ బాగుపడాలంటే ప్రత్యేక రాష్ట్రం అవసరం అని కేసీఆర్ తొలినాళ్ల నుంచే భావించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి మార్గదర్శకత్వంలో పోరాటం ప్రారంభించి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఒక్క తాటిపైకి తెచ్చి, 14 సంవత్సరాలపాటు శాంతియుతంగా, అహింసాత్మకంగా ఉద్యమాన్ని నడిపించారు. చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించారు” అని అన్నారు.అదేవిధంగా, కేసీఆర్ (KCR) పోరాట శైలి, నాయకత్వం దేశానికి ఆదర్శమని మధుసూదనాచారి పేర్కొన్నారు. “ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన త్యాగం, పట్టుదల, ధైర్యం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఆయన కేవలం తెలంగాణకే కాదు, దేశానికి కూడా ఒక ఆదర్శ నాయకుడు” అని అన్నారు.

Sirikonda Madhusudhanachari

ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన విషయాలు

ప్రజాయోధుడు పుస్తకాన్ని రాసిన మహేంద్ర తోటకూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ జీవిత చరిత్రను రాయడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. కేటీఆర్ ప్రోత్సాహంతోనే తాను ఈ పుస్తకం రాయాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు. మూడు నెలలు కష్టపడి కేసీఆర్ బాల్యం నుండి ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమైన విషయాలు, ఉద్యమంలో ఆయన పాత్ర, ఉద్యమాన్ని ముందుకు నడిపించిన తీరు.. ప్రత్యేక రాష్ట్ర సాధన.. ఆపై తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పదేళ్లలో చేసిన అభివృద్ధి గురించి పుస్తకంలో వివరించానని ఆయన తెలిపారు.అలానే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌ల మీద కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుందని మహేంద్ర చెప్పుకొచ్చారు.

పుస్తకం చదివిన వారు అద్భుతంగా ఉందని

తెలంగాణ కోసం కేసీఆర్ ఒక గొంతుకగా మారి దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలోని ప్రతి ఊరిలో, చెరువులో, నల్లా నీళ్లలో, మొక్కల్లో కూడా కేసీఆర్ ఆనవాళ్లు ఉన్నాయని తెలిపాు. ఎవరూ ఆయన ఆనవాళ్లను, ముద్రను చెరిపివేయలేరని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజాయోధుడు పుస్తకం చదివిన వారు అద్భుతంగా ఉందని ప్రశసంలు కురిపిస్తున్నారు.తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ పాత్ర సువిశాలమని, ఆయన లేకుండా తెలంగాణ రాష్ట్రం ఊహించలేమని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కష్టసుఖాలను లెక్కచేయకుండా పోరాడిన వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసల వర్షం కురిపించారు.

కేసీఆర్ పూర్తి పేరు ఏమిటి?

కేసీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.

కేసీఆర్ జననం ఎక్కడ జరిగింది?

కేసీఆర్ 1954 ఫిబ్రవరి 17న సిద్ధిపేట జిల్లా, చింటమడక గ్రామంలో జన్మించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/be-careful-with-bakery-food-items-bro/telangana/531024/

Breaking News BRS party Former Chief Minister KCR latest news Opposition Leader Sirikonda Madhusudanachari telangana legislative council Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.