📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Singur Project: ఉమ్మడి మెదక్ తో పాటు జంట నగరాల పరిస్థితేంటీ?

Author Icon By Tejaswini Y
Updated: January 6, 2026 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంగారెడ్డి బ్యూరో: తాగు, సాగునీటి వరప్రదాయనిగా పేరుగాంచిన సింగూరు ప్రాజెక్టు(Singur Project)ను ఖాళీ చేయడం తప్పదా.. అంటే అవుననే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో హైదరాబాద్ వాసులు జాగ్రత్తపడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక తాగునీటి తిప్పలు తప్పేలాలేవు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల గ్రామస్తులకు నీటి కటకట ఏర్పడనుంది. ఇకపై మిషన్ భగీరథ నీళ్లు వృధా చేస్తే వ్యధలు తప్పవు. ఇంతకీ జంట నగరాలతో పాటు మూడు ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి మంజీరా ఓ వరప్రదాయని ఈ సింగూరు ప్రాజెక్టు. జంట నగరాల దాహార్తిని తీర్చే అమృతభాండం మంజీరా. పంచభక్ష పరామన్నాలు తిన్నా.. గుక్కెడు మంజీరా నీళ్లు తాగితేనే తృప్తి.

Read also: Medaram Jatara: వాళ్లందరికీ స్పెషల్ డ్యూటీలు

ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 1800 గ్రామలకి మిషన్ భగీరథతో తాగునీటి అవసరాలు తీరుస్తుంది. అంతే కాదు ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌ జిల్లా(Nizamabad District)ల్లో వేల ఎకరాలకు సాగునీటి అవసరాలూ తీర్చుతుంది. వీటన్నింటికి ఆధారం మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు. మంజీరా నది మహారాష్ట్రలో మొదలై కర్నాటక మీదుగా సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ నదిపై పుల్కల్‌ మండలం సింగూరులో ప్రాజెక్టు నిర్మించారు. అదే బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు. 1976 నిర్మాణం ప్రారంభమై 1988లో పూర్తై ఈ ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చింది. 29.917 టిఎంసిల సామర్థ్యంతో 527 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. జంట నగరాల తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. దీంతో పాటు దిగువన ఉన్న మంజీరా బ్యారేజ్, నిజాంసాగర్‌లోకి పూడికను నివారించేందుకు ఉపయోగపడుతుందని భావించారు.

Singur Project: What is the status of the twin cities along with the joint Medak?

సింగూరు నుంచి సాగునీరు విడుదల చేయాలన్న డిమాండ్‌ తో ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. మెదక్ జిల్లా(Medak District)లోని ఘనపురం ఆనకట్టకు సైతం ఇక్కడి నుండే నీటిని విడుదల చేస్తే అక్కడి రైతులు వ్యవసాయం చేస్తారు. ఈ సింగూరు ప్రాజెక్టు కట్ట అంతా మట్టితో నిర్మించింది. 7 వేల 520 మీటర్ల మేర ఈ కట్ట విస్తరించి ఉంటుంది. రివిట్‌మెంట్‌ బండరాళ్లతో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు కట్ట నీటి అలల తాకిడిని తట్టుకుని నిలబడింది. లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని సైతం తట్టుకుంది. ఒకేసారి 8 లక్షల 16 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా దీనిని డిజైన్‌ చేశారు. సింగూరు వినియోగంలోకి వచ్చినప్పటి నుండి లేక్కెస్తే 2012 వరకు అంటే 24 సంవత్సరాల పాటు రివిట్‌మెంట్‌, కట్ట పటిష్టంగానే ఉన్నాయి. ఆ తర్వాత 2012లో సరైన మెయింటనెన్స్‌ లేకపోవడం, మరమ్మతులు చేయకపోవడంతో రివిట్‌మెంట్‌ దెబ్బతినడం మొదలైంది. రాళ్లు తొలగిపోవడం, కట్ట కుంగిపోవడం అక్కడక్కడ కనిపించింది. కానీ అప్పుడు ఎవ్వరు దీనిని పట్టించుకోలేదు. ఆ తర్వాత 2015- 2016, 2018- 2019 సంవత్సరాల్లో సింగూరు దాదాపుగా ఎండిపోయింది.

Read also: TG: త్వరలోనే కొత్తగా 2800 ఈవీ బస్సులు: మంత్రి పొన్నం

ఆ సమయంలో కట్టకు మరమ్మతులు చేసేందుకు మంచి అవకాశం ఉన్నా ఎవ్వరు పట్టించుకోకుండా ఉన్నారు. ఆ తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువైంది. గమనించిన అధికారులు పైపైన పనులు చేశారు. సిమెంట్‌ పూత పూసి మెరుగులద్దారు. కట్ట కింది నుంచి పనులు చేయకపోవడంతో సిమెంట్‌ నిలువలేదు. కట్ట కుంగిపోవడం మాత్రం ఆగలేదు. దింతో కట్టకు సపోర్ట్ గా వేసిన రాళ్లన్నీ పోయాయి. అలల తాకిడి నేరుగా కట్టపైనే పడింది. ఒకదశలో రివిట్‌మెంట్‌ కుప్పకూలింది. దీంతో అప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టారు. ఇసుక, కంకర చిప్స్‌ సంచుల్లో నింపి రివిట్‌మెంట్‌లా అమర్చారు. అలల దాటికి అవీ కూడా నిలవలేదు. ఒక వైపు అలల తీవ్రత, మరోవైపు కృంగిపోవడం పెరగడంతో మొత్తం ఓ లైన్‌ గీసినట్టే ఇసుక, కంకర చిప్స్‌ కృంగిపోయాయి.

కుంగడానికసింగూరు ప్రాజెక్టు(Singur Project) కేంద్ర పరిధిలోని డ్యాం రిహాబిటేషన్‌ ఇంప్రూమెంట్‌ ప్రాజెక్టు అయిన డ్రిప్ లో భాగంగా ఉంది. దీంతో డ్యాం సేఫ్టీ రివ్యూ ఫ్యానల్‌ అధికారులు దీనిని ఏడాదికి ఓ సారి పరిశీలిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్‌ 23న ఛైర్మన్‌ అశోక్‌ కుమార్‌ గుంజు, సభ్యులు యోగిందర్‌ కుమార్‌, రామరాజు, రాజు, కన్నయ్యలతో కూడిన బృందం పరిశీలించింది. ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. దీనిలో ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిలో అత్యంత ముఖ్యమైనది సింగూరు కట్టకు ఏ క్షణమైన గండి పడొచ్చు లేదా కట్ట కొట్టుకునిపోవచ్చు అన్నది దాని సారాంశం. అదే జరిగితే పరివాహక ప్రాంతం, ఘనపురం, ఏడుపాయల వనదుర్గా భవానీ, నిజాంసాగర్‌ ప్రాంతాలు మొత్తం నీట మునిగి తీవ్ర నష్ట వాటిల్లే ప్రమాదముందని పేర్కొంది. కట్ట పునాదిని వెంటనే గ్రౌటింగ్‌ చేయాలని పేర్కొంది. అయితే ఈ హెచ్చరికలు, ఆదేశాలు గతంలోనూ ఈ కమిటీ ఇచ్చిన పట్టించుకోలేదు.
2016, 2019, 2024 లో అన్నిసార్లు పైన పేర్కొన్న అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. కట్ట మరమ్మతులకు కేంద్రం నిధులు ఇవ్వకపోవచ్చని, రాష్ట్రమే సమకూర్చుకోవాలని పేర్కొంది. కానీ ఈ విషయాలను పెడచెవిన పెట్టిన ఫలితమే ఇప్పుడు ప్రాజెక్టు మనుగడను ప్రశ్నార్థకం చేసింది. ఈ నివేదికలో పేర్కొన్న మరో ప్రధాన అంశం. నీటి నిలువ.

Read also: Telangana: 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ

సింగూరు ప్రాజెక్టులో 517 మీటర్ల వద్దే నీటిని నిలువచేయాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మిషన్‌ భగీరథ అవసరాల కోసం ఎత్తును పెంచుతూ 2017లో అప్పటి BRS ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. 520 మీటర్ల పైన నీటిని నిలువ చేయొచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అప్పటి నుం డి 522 మీటర్ల వద్ద నీటిని నిలువజేస్తున్నారు. ఇది కట్ట రివిట్‌మెంట్‌ వేగంగా దెబ్బతింటానికి కారణమైందని డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్‌ బృందం అభిప్రాయపడింది. ఇంకా మరికొన్ని కీలకమైన విషయాలు ప్రస్తావించింది నిపుణుల బృందం. ఆనకట్టకు రక్షణగా ఉన్న పిట్టగోడకు నిలువునా చీలిక వచ్చిందని, స్పిల్‌వే, ఎర్త్‌ డ్యాం, గ్యాలరీలకు రిపేర్‌ చేయాలని చెప్పింది. గతంలో ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదని పేర్కొంది. రిజర్వాయర్‌ దిగువన టెయిల్‌పాండ్‌ కూడా సరిగా లేదని, రేడియల్‌ గేట్లకు పెయింటింగ్‌ చేయాలని, రబ్బర్‌ సీళ్లను మార్చాలని సూచించింది. 97 శాతం నీటి నిలువ గేట్లపై ఆధారపడి ఉందని గుర్తు చేసింది. గ్యాంటీ క్రేన్‌ ఆపరేటర్‌, ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌ను అందుబాటులో ఉంచాలని సూచించింది. వర్షాకాలం అయిపోయిన వెంటనే మరమ్మతులు చేపట్టాలని పేర్కొంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Google News in Telugu Hyderabad Water Supply Manjeera River Medak district Mission Bhagiratha Singur Project Telangana Irrigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.