📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Singer Chinmayi: వైరల్ అవుతున్న సింగర్ చిన్మయి పోస్ట్

Author Icon By Anusha
Updated: November 6, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి శ్రీపాద (Singer Chinmayi), గాయకురాలిగా మాత్రమే కాకుండా, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తిగా కూడా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మీటూ ఉద్యమ సమయంలో సినీ పరిశ్రమలో ఉన్న లైంగిక వేధింపులపై స్వర మొదలుపెట్టిన మొదటి మహిళల్లో చిన్మయి ఒకరు.

Read Also: Kaantha Movie: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ ట్రైలర్ రిలీజ్

ఆ సమయంలో తమిళ సినిమా ఇండస్ట్రీ (Tamil film industry) లో ఉన్న పలువురు ప్రముఖులపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.రీసెంట్ డేస్ లో ట్విట్టర్ వాడకం మరింత ఎక్కువైంది. సినీ సెలబ్రెటీలు , కొందరు ప్రముఖులు ట్విట్టర్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ కొందరు ఆకతాయిలో ఎక్స్ (ట్విట్టర్ )లో బూతులు మాట్లాడుతూ.. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు.

కొందరు ఆడపిల్లల గురించి పిచ్చి వాగుడు వాగుతున్నారు. తాజాగా కొంతమంది అబ్బాయిలు ఓ గ్రూప్ గా క్రియేట్ అయ్యి పచ్చి బూతులు మాట్లాడారు. దీని పై సింగర్ చిన్మయి (Singer Chinmayi) సీరియస్ అయ్యింది. పోలీస్ డిపార్ట్మెంట్ ను ట్యాగ్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పింది.ట్రోలర్స్‌ అకౌంట్స్ ను ట్యాగ్ చేస్తూ సరైన యాక్షన్ తీసుకోవాలని కోరింది.

సజ్జనార్ సర్.. దయచేసి దీన్ని గమనించండి

గౌరవనీయులైన సజ్జనార్ (Sajjanar) సర్.. దయచేసి దీన్ని గమనించండి.నేను ఈ రోజువారీ వేధింపులతో విసిగిపోయాను. తెలంగాణలో మహిళలు మెరుగైన అర్హత కలిగి ఉన్నారు. వారికి ఏదైనా అభిప్రాయం నచ్చకపోతే వారు విస్మరించి వెళ్లిపోవచ్చు. నేను ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. ఈ కేసు 15 సంవత్సరాలు పట్టినా చట్టం తన పని తాను చేసుకోనివ్వండి.

ఈ వ్యక్తులు నా పిల్లలు చనిపోవాలని చెబుతున్నారు. దయచేసి సహాయం చేయండి. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. చిన్మయి ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరు ట్రోల్ చేశారనే విషయాన్ని తెలుసుకోవడానికి..  ట్రోలర్స్ అకౌంట్స్ గురించి ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే ట్రోలర్లు తమ అకౌంట్లను డీ యాక్టివేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Chinmayi Sripaada latest news Telugu News VC Sajjanar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.