హైదరాబాద్: సింగరేణి(Singareni) సంస్థ బలం కేవలం ఉత్పత్తిలో కాదని, తరతరాల శ్రమ, క్రమశిక్షణ, పరస్పర నమ్మకంతో పనిచేస్తున్న కార్మికులేనని ఇన్చార్జి సిఎండి డి. కృష్ణ భాస్కర్ (Krishna Bhaskar) వెల్లడించారు. 137 సంవత్సరాలుగా ఈ సంస్థ దృఢంగా నిలబడటం వెనక వీరి కృషి ఉందని పేర్కొన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కార్మికుల భద్రత, సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి ప్రధాన ప్రాధాన్యాలని స్పష్టం చేశారు.
Read Also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?
ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను మెరుగుపరచడం, పని పరిస్థితులను మరింత సురక్షి తంగా చేయడమే లక్ష్యంమన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎన్నో వాతావరణ ప్రతికూలతలు, సాంకేతిక సవాళ్లు, మార్కెట్ మార్పులు ఉన్నప్పటికీ భద్రత ప్రమాణాలను పాటిస్తూ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ముందుకు సాగినట్లు తెలిపారు.
సింగరేణి భవిష్యత్ పై అందరం ప్రశ్నించు కోవాలని, వాటికి సమాధానాలు వెతుక్కోవాల్సిన బాధ్యత మనదే అన్నారు. ఈ దిశలోనే ఉత్పత్తి సంస్థ(Production company) సామర్థ్యం, స్థిరత్వం, భవిష్యత్తు అవకాశాల కోసం ఇతర రంగాల పైనా దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో, కీలక ఖనిజాలు, అనుబంధ రంగాల్లో అవకాశాలు ఉన్నాయా అనే అంశాన్ని మనం పరిశీలించడం ప్రారంభించామన్నారు. అలాగే ఇంధన రంగంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ, పునరుత్పాదక శక్తి వంటి రంగాలపై దృష్టిసారించినట్లు చెప్పారు. సింగరేణి లో మహిళా శక్తి పెరుగుతున్న తీరు, గనుల్లో, ఆపరేషన్లలో, రక్షణ బృందాల్లో మహిళల భాగస్వామ్యం సింగరేణి పరిణతికి గొప్ప సూచికగా అభివర్ణించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: