📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Singareni Collieries: మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Author Icon By Rajitha
Updated: January 18, 2026 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సంస్థలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమ మంత్రుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించవద్దని స్పష్టంగా హెచ్చరించారు. మీడియా సంస్థల మధ్య విభేదాలుంటే వాటిని పరస్పరం తేల్చుకోవాలని, కానీ ప్రభుత్వ మంత్రుల జోలికి మాత్రం రావొద్దని తేల్చిచెప్పారు. ఏదైనా వార్త రాసేముందు తన వద్ద నుంచి వివరణ తీసుకోవాలని సూచించారు. తప్పుడు కథనాలు వెలువడితే అది తన గౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టేనని సీఎం పేర్కొన్నారు.

Read also: Ward Reservations: నారాయణఖేడ్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

CM Revanth Reddy issues a strong warning to the media

ఖమ్మం పర్యటనలో కీలక ప్రకటనలు

ఖమ్మం జిల్లా ఏదులాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో రూ.362 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని గుర్తు చేసిన సీఎం, ఈ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని స్పష్టం చేశారు.

సింగరేణి టెండర్లపై ఆరోపణలకు ఖండన

సింగరేణి (singareni) బొగ్గు గనుల టెండర్ల విషయంలో అవినీతి జరిగిందంటూ వస్తున్న కథనాలను సీఎం తీవ్రంగా ఖండించారు. అనుభవం ఉన్న సంస్థలకే టెండర్లు కేటాయిస్తున్నామని, ఇందులో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. గత రెండేళ్ల పాలనలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని ధీమా వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయవద్దని మీడియాకు హితవు పలికారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పట్లో రేషన్ కార్డు పొందాలంటే ఎవరో ఒకరు చనిపోవాల్సిన పరిస్థితి ఉండేదని సీఎం వ్యాఖ్యానించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసిందని తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2కే కిలో బియ్యం పథకాన్ని గుర్తు చేస్తూ, తమ ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందిస్తోందన్నారు. అలాగే వైఎస్ఆర్ స్ఫూర్తితో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. పేదలకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించినట్లు వెల్లడించారు.

భద్రాచలం అభివృద్ధిపై సీఎం హామీ

భద్రాచలం అభివృద్ధిపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి భద్రాచలాన్ని అయోధ్య తరహాలో అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. మంత్రులంతా సమన్వయంతో పనిచేస్తున్నారని, రాబోయే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Media Warning Revanth Reddy singareni telangana cm Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.