📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Sigachi Blast: ఆశలన్నీ కన్నీరయ్యే..ప్రమాదంలో మృతి చెందిన దంపతులు

Author Icon By Sharanya
Updated: July 1, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ప్రమాదంలో అత్యంత హృదయ విదారక ఘటనగా నిలిచింది కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి మరియు పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్య మృతివార్త. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న ఈ యువ దంపతులు ఈ నెల తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి వేడుక ఘనంగా జరుపుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ వారి కలలు కేవలం ఊహల్లోనే మిగిలిపోయాయి.

ప్రేమ వివాహం చేసిన కొత్త దంపతులకు విషాదాంతం:

సోమవారం సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ (Sigachi industry) లో జరిగిన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాద సమయంలో కంపెనీలో పనిచేస్తున్న కడప జిల్లా జమ్మలమడుగు (Jammalamadugu) కు చెందిన నిఖిల్​ రెడ్డి, శ్రీరమ్య ఆచూకీ గల్లంతైంది. నిఖిల్​ రెడ్డి ఇటీవలే ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నామాల శ్రీరమ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఆషాఢ మాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనండా వేడుక చేద్దామని అనుకున్నారు. ఈ క్రమంలో పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో దంపతులిద్దరూ దుర్మణం చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ మృతితో కార్పొరేట్ స్థాయిలోనూ తీరని లోటు:

ఈ ప్రమాదంలో సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ప్లాంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ మృతిచెందారు. గోవన్‌ ప్లాంట్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించడంతో ప్రమాద ధాటికి ఆయన కారు నుజ్జునుజ్జయింది.

మృతుల సంఖ్య 36కి చేరింది – సహాయక చర్యలు ముమ్మరం:

ఈ ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

సీఎం రేవంత్ పరస్పరిత పరిశీలన:

ప్రమాదం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఘటనపై వివరాలను జిల్లా ఇంఛార్జి మంత్రి వివేక్​, మంత్రి దామోదర రాజ నర్సింహను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాద స్థలంలోనే మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

పరిశ్రమ భద్రతపై ప్రశ్నలు:

ఈ ఘటన మరోసారి ఫార్మా పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై అనేక అనుమానాలు రేకెత్తించింది. రసాయనాల నిల్వ, కార్మికుల రక్షణా పరికరాల లేమి, సేఫ్టీ ప్రమాణాల పాటించకపోవడం వంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Read also: Pashamylaram: సిగాచీ ఫ్యాక్టరీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

#ChemicalBlast #IndustrialAccident #NikhilAndSriramya #sangareddy #SigachiBlast #telangana #TragicLoveStory Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.