Latest News: CM Revanth: సీఎం రేవంత్ ను కలిసి శుభలేఖ సుధాకర్

Read Time:  1 min
Latest News: CM Revanth: సీఎం రేవంత్ ను కలిసి శుభలేఖ సుధాకర్
FONT SIZE
GET APP

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీనటుడు, శుభలేఖ సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15న రవీంద్ర భారతి ఆవరణ (Ravindra Bharathi Precinct) లో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా ముఖ్యమంత్రి (CM Revanth) ని ఆహ్వానించారు. రవీంద్ర భారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు ఎస్పీ బాలు కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Also: TG: మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదన్న కిషన్ రెడ్డి

Shubhalekha Sudhakar meets CM Revanth
Shubhalekha Sudhakar meets CM Revanth

ఎంతోమంది నూతన గాయనీ, గాయకులను వెలుగులోకి తెచ్చారు

గాయకుడు బాలసుబ్రహ్మణ్యం (Balasubramanyam) తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడి శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అంతేకాకుండా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించారు.

సినిమాల్లోనే కాకుండా టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ, గాయకులను వెలుగులోకి తెచ్చారు. ఆయన 2020 సెప్టెంబర్ 25న కన్నుమూశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.