📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sravanam: శుభకార్యాలకు వేళాయో..

Author Icon By Vanipushpa
Updated: July 24, 2025 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేటితో ఆషాఢం(Ashadam) ముగియనున్నడంతో శ్రావణం(Sravanam) మాసం కోసం అనేకులు నిరీక్షిస్తున్నారు. కల్యాణం వైభోగం, ఆనందరాగాల శుభయోగం అంటూ రేపపల్లెల్లో, పట్టణాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే(May)నెల 24 నుంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు చేసుకునేవారు ఎప్పుడెప్పుడు శ్రావణమ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. రేపటి నుంచి శ్రావణమాసం ఆరంభం కానుండటంతో ఇక శుభకార్యాలను ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ముహూర్తాల కోసం ఆరాటం..
శ్రావణ మాసం అంటే మంచిరోజులకు అనువైనదని పండితులు, హిందువులు భావిస్తారు. ఈనెల 26, 20, 31 తేదీల్లోనూ, ఆగస్టులో 1,3,4, 6, 10, 13, 1 తేదీల్లో శుభముహూర్తాలున్నట్లు బ్రాహ్మణులు చెబుతున్నారు.

Shravanam: శుభకార్యాలకు వేళాయో..

పత్రాలు, నోములకు వేళ
పెళ్లిళ్లతోపాటు ఇళ్లలో చేసుకునే నోములు, మంగళగౌరి, వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలను ఆచరించనున్నారు. అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పిస్తారు. ఇక నూతన గృహప్రవేశాలకు కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. ఆగస్టు 24 నుంచి భాద్రపద మాసం ప్రారంభం కావడంతో ఆనెలలో శుభకార్యాలు నిర్వహించడానికి అవకాశమే లేదు. ఆ తర్వాత వచ్చే ఆశ్వయుజ, కార్తిక మాసాలు శుభకార్యాలకు మంచివి. శ్రావణమాసం నేపథ్యంలో కల్యాణమండపాలు, ఆలయాల ప్రాంగణాలను ముస్తాబు చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో శ్రావణమాసం అంత సందడిగా మారనుంది.

వ్యాపారాలు పుంజుకోనున్నాయి
పెళ్లి సీజన్​తో పుంజుకోనున్న అనుబంధ వ్యాపారాలు : మంచి ముహూర్తాలు రానున్న నేపథ్యంలో బ్రాహ్మణోత్తములతో ముహూర్తాలను ఖరారు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు సీజన్​ కావడంతో వ్యాపారాలు కూడా అంతే వేగంగా పుంజుకోనున్నాయి. పెళ్లిళ్లకు అనుబంధంగా ఉన్న ఫంక్షన్​ హాళ్లు, టెంట్లు, డీజే సౌండ్స్​ వంటి వాటిని బుక్​ చేసుకుంటున్నారు. పెళ్లి పందిళ్ల అలంకరణ వంటి వాటికి డిమాండ్​ కూడా భారీగా పెరగనుంది. పత్రికలకు, క్యాటరింగ్​ వారికి ఇప్పటి నుంచే ఆర్డర్లు ఇస్తున్నారు. ఫొటో, వీడియోగ్రాఫర్ల గురించి బంధువుల ద్వారా ఇప్పటి నుంచే ఆరా తీస్తున్నారు. బాజాబజంత్రీలు, సన్నాయిలకు డిమాండ్​ పెద్ద ఎత్తున ఉంటుంది. ఇప్పటికే ఎప్పటి బుకింగ్​లు అప్పుడు పూర్తి అయిపోయాయి. తల్లిదండ్రులు పెళ్లి హడావిడిలో ఉన్నారు. అటు బంగారం ధర భారీగా పెరిగినా కొనుగోళ్లకు ఏమాత్రం తగ్గడం లేదు. సరికొత్త డిజైన్ల గురించి ఆరా తీస్తున్నారు. కొందరైతే ముందుగానే ఆర్డర్లు ఇచ్చి చేయించుకుంటున్నారు. ఇక ఈ నెల రోజులు జ్యూయలరీ షాపులకు కూడా డిమాండ్ మామూలుగా ఉండదు. ఈ ఆనంద సంబురాలు ఆగస్టు 24 వరకు ఉండనున్నాయి .

శ్రావణ చరిత్ర ఏమిటి?
శ్రావణాన్ని సావన్ అని కూడా పిలుస్తారు, ఇది హిందూ క్యాలెండర్‌లో ఐదవ నెల మరియు దీనిని శివుడికి అంకితం చేసిన చాలా పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఈ నెల పేరు "శ్రావణ" నక్షత్రం (నక్షత్రం) నుండి ఉద్భవించింది. శ్రావణ చరిత్ర సముద్ర మంథనం (విశ్వ సముద్రాన్ని చిలకరించడం) పురాణంతో లోతుగా అనుసంధానించబడి ఉంది, ఇక్కడ శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి విషాన్ని సేవించాడు.

శ్రావణ మాసం నియమాలు ఏమిటి?
సావన్ అని కూడా పిలువబడే శ్రావణ మాసం శివుడికి అంకితం చేయబడిన నెల, దీనిని నిర్దిష్ట ఆచారాలు మరియు పద్ధతులతో పాటిస్తారు. ఈ సమయంలో, భక్తులు సాధారణంగా మాంసాహారం, మద్యం మరియు ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వంటి కొన్ని కూరగాయలకు దూరంగా ఉంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Minister Ramprasad: ఆధునిక సాంకేతికతతో రవాణా శాఖను మరింత బలోపేతం చేస్తాం: మంత్రి రాంప్రసాద్

Auspicious Month Hindu Festivals Latest News Breaking News Religious Ceremonies Shravanam 2025 Shubh Muhurat Spiritual Significance Vrat and Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.