📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Shivdhar Reddy: ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్

Author Icon By Tejaswini Y
Updated: November 15, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ అరైవ్, అలైవ్ పేరిట చేబట్టిన కార్యక్రమం శుక్రవారం ఘనంగా మొదలయ్యింది. ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, సినీతారల సమక్షంలో నిర్వహిం చిన ఈ కార్యక్రమాన్ని డిజిపి శివధర్ రెడ్డి(Shivdhar Reddy) ప్రారంభిం చారు. ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగించేలా ఉందని, వీటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నా రని, మరెంతో మంది క్షతగాత్రులవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also:  Jobs: NFC హైదరాబాద్‌లో 405 అప్రెంటిస్ పోస్టులు

ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడంవల్ల ప్రమా దాలను నివారించవచ్చని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు అనేది ఏ ఒక్కరి సమస్య కాదని, అందరికి సంబంధించిన సమస్యలని ప్రతీ కుటుంబం బాధ్యత తీసుకుని ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలని ఆయన కోరారు.
ఎవరో చేసిన తప్పిదాల వల్ల అమాయకులు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. రాష్ట్రంలో ఏటా 800 హత్యలు జరుగుతుంటే రోడ్డు ప్రమాదాల ద్వారా పదింతలమంది చనిపోతున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా యు వత హెల్మెట్ లేకుండా ద్వీచక్ర వాహనాలు నడపడం, సెల్ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపటం, ట్రిబుల్ రైడింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురై విలువైన ప్రాణాలకు పోగోట్టుకుంటున్నారని, కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగుల్చుతున్నారని ఆయన ఆ వేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే అరైవ్, అలైవ్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు. ఇందులో రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన. పెంపొందించడం, నియమాలు కచ్చితంగా పాటించేలా చేయడం, వాహనదారులు బాధ్యతగా వుండేలా చేయడం, డ్రైవర్లు సవ్యంగా డ్రైవింగ్ చే సేలా చూడడం ఇందులో ముఖ్యమని డిజిప్ తెలిపారు.

Shivdhar Reddy:డ్రైవింగ్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను కనీనస్థాయికి త గ్గించగలుగు తామని డిజిపి తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ మాట్లా డుతూ దేశంలో ప్రతి ఏడాది నాలుగున్నర జరుగుతున్నాయని, లక్షమందికిపైగా చనిపోతున్నారని, ఐదు లక్షల మందికి పైగా క్షతగాత్రులవు తున్నారని, హైదరాబాద్ నగరంలో మూడు వేల రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయని, మూడు వందల మంది మృత్యువాత లక్షల రోడ్డు ప్రమాదాలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

హాస్యనటుడు బాబుమోహన్ మాట్లాడుతూ తాను ఎసిఐ కావాలనుకున్నానని కాని ఆ కోరిక తీరలేదని, జంబలకిడిపంబ సినిమాలో ఎస్ఐగా పాత్ర ధరించడంతో నా కోరిక తీరిందన్నారు. సమావేశంలో రోడ్ సేఫ్టీ విభాగం ఐజి రమేష్ నాయుడుతో పాటు సిటీ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, సినీ హీరోలు తేజా సజ్జా. శ్వూనంద్, సాయికుమార్, దర్శకుడు బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రోడ్డు ప్రమాదాల నివారణపై రూపొందించిన చైతన్య కార్యక్రమాలు డాక్యుమెంటరీ ద్వారా ప్రదర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

ArriveAlive DGPSivadharReddy LBStadium RoadSafety TelanganaPolice

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.