- శివ్వంపేట పీఏసీఎస్ కార్యాలయం ముందు రైతుల నిరసన
- రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న పీఏసీఎస్ అధికారులు
Shivampet News: వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్లు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రత్నాపూర్ గ్రామానికి చెందిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు తరలించేందుకు లారీలు పంపించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఈవో మధుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ పంటను ఆరుగాలం కష్టపడి పండించి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చామని, అయితే రోజుల తరబడి ధాన్యం అక్కడే పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
Read also: Siddipet news: వడ్ల కొనుగోళ్లపై హరీశ్ రావు ఆగ్రహం!

Shivampet News:వాతావరణం మారితే పంటకు నష్టం
ప్రస్తుతం వాతావరణం మారుతున్న నేపథ్యంలో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉందని, ఒకవేళ వర్షం కురిస్తే ధాన్యం తడిసి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాన్ని అధికారులు అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు తక్షణమే లారీలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం రైతులు నర్సాపూర్ తూప్రాన్ ప్రధాన రహదారిపై బైటాయించి సీఈఓ మధు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: