📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Shiv Raj Kumar: ప్రారంభమైన గుమ్మడి నర్సయ్య బయోపిక్‌

Author Icon By Anusha
Updated: December 6, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య (Gummadi Narasaiah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు మాజీ ఎమ్మేల్యే గుమ్మడి నర్సయ్య. ఇప్పుడు ఆయన జీవితకథతో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్. సురేశ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Read Also: Kalyani Priyadarshan: కార్తీ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్?

ఈ క్రమంలోనే శనివారం పాల్వంచలో గుమ్మడి నర్సయ్య (Gummadi Narasaiah) బయోపిక్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్త షాట్‌కు కెమెరా స్విచ్‌ ఆన్ చేశారు. ఈ కార్యక్రమలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గమ్మడి నర్సయ్యను ప్రజల మనిషి, పేదవారి దేవుడు అంటూ కొనియాడారు. ఎమ్మెల్యే జీతం, ఆస్తులను దానం చేయడం, సైకిల్‌ను వాడటం నర్సయ్య నిరాడంబరతకు నిదర్శనమన్నారు.

శివరాజ్ కుమార్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ (Shiv Raj Kumar) మాట్లాడుతూ.. గుమ్మడి నర్సయ్య సినిమా కోసం తాను తెలుగు నేర్చుకుంటానని.. తనే స్వయంగా డబ్బింగ్ చెబుతానని అన్నారు.“ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మంచి మనిషి జీవిత చరిత్రలో నేను నటిస్తున్నాను. మన కోసం కాదు.. ఇతరుల కోసం బతకాలని మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. నాకు అలా ఉండడమే ఇష్టం.

శుక్రవారం గుమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబసభ్యులను కలిశాను. నా సొంత మనుషులను కలిసినట్లు అనిపించింది.నర్సయ్యను చూస్తుంటే మా నాన్నను చూసినట్లు అనిపించింది. నేను తెలుగులో మాట్లాడం లేదని ఏమీ అనుకోకండి. త్వరలోనే తెలుగు నేర్చుకుంటాను. ఈ సినిమాకు నేనే స్వయంగా డబ్బింగ్ చెబుతాను. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత కచ్చితంగా దీనిని వీక్షించాలి” అని శివరాజ్ కుమార్ (Shiv Raj Kumar) అన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

cinematography minister Komatireddy Venkat Reddy Gummadi Narasaiah biopic latest news Palvancha event Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.