📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Shamshabad: ఎయిర్ పోర్ట్ లో అయ్యప్ప స్వాముల ఆందోళన..

Author Icon By Sushmitha
Updated: December 5, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (airport) శుక్రవారం ఉదయం మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి కొచ్చి (కొచ్చిన్) వెళ్లాల్సిన విమానం ఏకంగా 12 గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు, ముఖ్యంగా శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు, ఆందోళనకు దిగారు.

Read Also: TG: అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నిర్వాకం కారణంగా అయ్యప్ప స్వాములు శంషాబాద్ (Shamshabad) ఎయిర్‌పోర్టులో పడిగాపులు పడాల్సి వచ్చింది. విమానం ఆలస్యం కావడానికి కారణం మరియు ఆ సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం బయలుదేరాల్సిన విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో, వారు బోర్డింగ్ గేటుకు అడ్డంగా నిలబడి ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

Shamshabad Ayyappa Swami’s agitation at the airport

వరుస రద్దులు: పెరిగిన ప్రయాణికుల అసౌకర్యం

గత మూడు రోజులుగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వాకంతో అయ్యప్ప స్వాములు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బుధవారం మరియు గురువారం కూడా శంషాబాద్ నుంచి కేరళకు వెళ్లే విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడంతో శబరిమల యాత్రకు బయలుదేరిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విమానం ఎలా రద్దు చేస్తారు?” అంటూ భక్తులు అధికారులను ప్రశ్నించారు. విమానం రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే మరో సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని లేదా ప్రత్యేక విమానాన్ని నడపాలని డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, అసౌకర్యం పెరగడంతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది.

ఆలస్యానికి కారణాలు వెల్లడించని సిబ్బంది

షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం 9.40 గంటలకు రావాల్సిన విమానం కూడా ఆలస్యం కావడానికి కారణాలు కూడా సిబ్బంది సరిగా వివరించలేదు. దీంతో స్వాములు ఆందోళనకు దిగడంతో.. సిబ్బంది సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఇండిగో ఎయిర్‌లైన్స్ (Airlines) వైఫల్యం కారణంగా శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు పడుతున్న ఇబ్బందులు విమానాశ్రయంలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

12HourDelay AyyappaSwamis FlightDelay Google News in Telugu IndigoAirlines KochiFlight Latest News in Telugu PassengerProtest RajivGandhiAirport ShamshabadAirport Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.