📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Shamshabad Airport: సాంకేతిక సమస్యల కారణంగా పలు విమానాలు ఆలస్యం..

Author Icon By Sushmitha
Updated: November 8, 2025 • 11:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో(airports) సాంకేతిక సమస్యల కారణంగా పలు ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ సమస్య కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 350కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో పాటు శంషాబాద్‌(Shamshabad) (హైదరాబాద్) నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం అయ్యాయి. అలాగే చెన్నై నుంచి శంషాబాద్‌ రావాల్సిన రెండు విమానాలు కూడా ఆలస్యం అయ్యాయి.

Read Also: AP: దేవాలయాల్లో సాంకేతిక సదుపాయాలు.. 100 కియోస్క్‌ల ఏర్పాటు

Shamshabad Airpor

శంషాబాద్‌లో ప్రయాణికుల ఆందోళన

సాంకేతిక సమస్యతో విమాన సర్వీస్‌లు ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వియత్నం బయలుదేరాల్సిన విమానం రన్‌వే పైనే నిలిచిపోయింది. టేకాఫ్ అవ్వకుండా కొన్ని గంటల పాటు ప్రయాణికులతో ఉండిపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విమాన సమయాలపై ఎయిర్‌పోర్ట్ అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఎయిర్‌లైన్(Airline) సిబ్బందితో గొడవ పడుతున్నారు. వీకెండ్ కావడంతో విమానాశ్రయం రద్దీగా ఉంది, దీంతో 200 మందికి పైగా ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాశారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందన

ఈ సాంకేతిక సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్‌పోర్టుల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని, ATCలో సాంకేతిక లోపం వల్లే అంతరాయం ఏర్పడిందన్నారు. సాంకేతిక సమస్య వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం లేదని, అయినప్పటికీ లోతైన దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తామని, సకాలంలో విమానాలు నడిచేలా చర్యలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

ATC failure Delhi airport Flight Delays Google News in Telugu Latest News in Telugu Ram Mohan Naidu. Shamshabad technical glitch Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.