📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Shadnagar Ward 15 Tension: కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య లొల్లి

Author Icon By Siva Prasad
Updated: February 11, 2026 • 8:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Shadnagar Ward 15 Tension: షాద్ నగర్ పట్టణంలోని 15వ వార్డులో పోలింగ్ సందర్భంగా బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల మధ్య నెలకొన్న పరస్పర ఆరోపణలతో పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

Read Also: Telangana municipal elections : మున్సిపల్ పోలింగ్ ముగిసింది, కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్

పరస్పర ఆరోపణలు – దౌర్జన్యకాండ

15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భర్త సాదిక్ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూతులోకి ప్రవేశించారని బిఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. దీనికి ప్రతిగా, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్ దౌర్జన్యంగా బూతులోకి వచ్చి తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ఓటర్లపై ఒత్తిడి తెస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి.

పోలీసుల రంగప్రవేశం – అభ్యర్థుల భర్తల బహిష్కరణ

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువురు మహిళా అభ్యర్థుల భర్తలను పోలింగ్ కేంద్రం నుండి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి భర్త సాదిక్ స్వచ్ఛందంగా బయటకు రాగా, ప్రత్యర్థి వర్గాల ఉనికిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇరు వర్గాలు అక్కడే భీష్మించుకుని కూర్చున్నాయి. దీంతో పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపాల్సి వచ్చింది.

Shadnagar Ward 15 Tension: Tension between Congress and BRS party candidates

Shadnagar Ward 15 Tension: పోలీసులతో బిఆర్ఎస్ నేతల వాగ్వివాదం

మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్‌ను కొందుర్గు ఎస్సై రవీంద్ర నాయక్ బయటకు పంపించడంతో బిఆర్ఎస్ (టిఆర్ఎస్) కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ వారు నినాదాలు చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Shadnagar. BRS vs Congress Clash Congress Leader Sadiq Former Municipal Chairman Narender Political Tension in Shadnagar Shadnagar Local Body Polls Shadnagar Municipal Election 2026 Shadnagar Ward 15 Telangana Election News Ward 15 Polling Issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.