shadnagar annadanam: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది. ప్రతి అమావాస్య రోజున పట్టణంలోని మొల్లమాంబ విగ్రహం వద్ద, షాద్‌నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆదివారం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పేదలు, అవసరార్థులు పాల్గొని భోజనం స్వీకరించారు. ఈ సేవా కార్యక్రమాన్ని షాద్‌నగర్ కుమ్మరి సంఘం అధ్యక్షులు నడికుడ రుక్మిణి దేవి శ్రీశైలం, మల్లయ్య గారి జ్యోతిర్మయి జ్ఞానేశ్వర్, కే.కృష్ణయ్య, కే.రమేష్ (ఉప సర్పంచ్, పెంజర్ల), శ్రీనివాస్ తదితరులు సమిష్టిగా నిర్వహించారు.
Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు
ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ (shadnagar annadanam) అమావాస్య రోజున పెద్దల ఆశీర్వాదంతో పేదల కడుపు నింపాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి అమావాస్యకు ఇదే విధంగా అన్నదానం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పేదలకు అన్నదానం చేయడం తమకు దక్కిన అదృష్టమని, ఇది మానవ సేవలో భాగమని పేర్కొన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని, ఇతరులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: