📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Shadnagar Ganja Case: షాద్‌నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

Author Icon By Siva Prasad
Updated: February 25, 2026 • 11:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Shadnagar Ganja Case: వార్తా కథనం షాద్‌నగర్, ఫిబ్రవరి 25: రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విజయ్ కుమార్ వెల్లడించారు.

Read Also: Congress Govt : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటుంది – హరీష్ రావు

తనిఖీల్లో దొరికిపోయిన నిందితులు

మంగళవారం సాయంత్రం షాద్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై శ్రీకాంత్ మరియు సిబ్బంది ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా, వారి వద్ద కిలో గంజాయి లభ్యమైంది.

లేబర్ పని చేస్తూ గంజాయి దందా

పోలీసుల విచారణలో పట్టుబడిన వారు బిహార్‌కు చెందిన రాజన్ చౌదరి (30) మరియు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన శివమ్ యాదవ్ (24) గా గుర్తించారు. వీరు ప్రస్తుతం ఫరూక్ నగర్ ప్రాంతంలో లేబర్ పని చేసుకుంటూ నివసిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సంతు అనే వ్యక్తి ద్వారా గంజాయిని తెప్పించి, చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి గుట్టుచప్పుడు కాకుండా స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

Shadnagar Ganja Case:కేసు నమోదు – రిమాండ్

నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని, గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సంతు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CI Vijay Kumar Drug Bust Rangareddy Future City Commissionerate Interstate Ganja Smugglers Shadnagar Ganja Case Shadnagar News Today Shadnagar Police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.