📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Shadnagar Raikal Lake: హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు

Author Icon By Siva Prasad
Updated: March 3, 2026 • 11:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Shadnagar Raikal Lake: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. హోలీ పండుగ సందర్భంగా సెలవు ఉండటంతో సరదాగా ఈతకు వెళ్లిన ఒక విద్యార్థి చెరువులో మునిగి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఫరూక్ నగర్ మండలం రాయికల్ శివారులో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.

Read Also: CM Revanth Reddy : కలెక్టర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

స్నేహితులతో కలిసి వెళ్లగా..

గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు అనే విద్యార్థి, షాద్‌నగర్ నేషనల్ హైవే పక్కన ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల వసతి గృహంలో చదువుతున్నాడు. మంగళవారం హోలీ సెలవు కావడంతో రాజు తన మరో నలుగురు స్నేహితులతో కలిసి రాయికల్ శివారులోని చెరువుకు ఈత కొట్టడానికి వెళ్లాడు.

Shadnagar Raikal Lake: కొనసాగుతున్న గాలింపు

చెరువులోకి దిగిన రాజు మధ్యాహ్నం నుండి ఇప్పటివరకు బయటకు రాలేదు. దీంతో భయాందోళనకు గురైన స్నేహితులు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు ఉధృతం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను కూడా రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు.

చదువుకోవడానికి పంపిన కొడుకు ఇలా చెరువులో గల్లంతయ్యాడన్న వార్త విన్న రాజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురుకుల పాఠశాల యాజమాన్యం మరియు పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Holi Accident Telangana Hyderabad News Today Mahatma Jyotirao Phule BC Welfare School NDRF Search Operations Raikal Cheruvu Incident Shadnagar News Shadnagar Raikal Lake Student Missing in Lake

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.