📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

BC Reservation: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Author Icon By Sudheer
Updated: July 11, 2025 • 6:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల (BC Reservation) విషయంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమోదం తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే ఈ మేరకు బిల్లును ఆమోదించగా, ఇప్పుడు మంత్రివర్గం ఆమోదంతో రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు ఇది పెద్ద విజయం. దీనిపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఆర్డినెన్స్‌ ద్వారా చట్ట సవరణ – కుల గణన ఆధారంగా నిర్ణయం

ఈ నిర్ణయం కోసం ప్రభుత్వం ముందస్తుగా పలు చర్యలు తీసుకుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కుల గణన చేపట్టింది. వీటి ఆధారంగా ప్రభుత్వం ఎంపిరికల్ డేటాను సమకూర్చింది. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయిలో నియోజకవర్గాల విభజన చేసి రిజర్వేషన్ల అమలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. రిజర్వేషన్ పెంపుతో పాటు పంచాయతీరాజ్ చట్టం-2018లో సవరణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఉద్యోగాల భర్తీ, విద్య, గోశాలల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు

ఈ కేబినెట్ సమావేశం(Telangana cabinet meeting)లో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 22,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు భర్తీ కాగా, మరో 17,000 నియామక ప్రక్రియలో ఉన్నాయి. అదేవిధంగా, AMITY, సెయింట్ మేరీస్ అనే రెండు ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారు. తెలంగాణ విద్యార్థులకు AMITY యూనివర్సిటీలో 50% అడ్మిషన్ల రిజర్వేషన్ ఇవ్వనున్నారు. గోశాలల అభివృద్ధికి ప్రత్యేక కమిటీను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించనున్నారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని విభిన్న రంగాల్లో పలు సంస్కరణలు తీసుకొస్తున్నది.

Read Also : Penchala Kishore : కాణిపాకంలో విరిగిన పాలతో అభిషేకంపై స్పందించిన కాణిపాకం ఆలయ ఈవో

BC Reservation Telangana Telangana cabinet meeting telangana government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.