Senior Sweeper Salary: తెలంగాణలో స్వీపర్ జీతం రూ. 2 లక్షలు

Read Time:  1 min
Senior Sweeper Salary: తెలంగాణలో స్వీపర్ జీతం రూ. 2 లక్షలు
FONT SIZE
GET APP

Senior Sweeper Salary: తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో వేతనాలు ఊహించని స్థాయికి చేరుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్ధిక శాఖ) రామకృష్ణారావు వెల్లడించారు. బుధవారం జరిగిన ఒక ఉన్నత స్థాయి రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ప్రతి నెలా రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నట్లు బుధవారం జరిగిన రివ్యూ మీటింగ్‌లో వెల్లడించారు. విద్యుత్ శాఖలో చాలా కాలంగా పనిచేస్తున్న ఒక సీనియర్ స్వీపర్‌కు ప్రస్తుతం నెలకు దాదాపు రూ. 2 లక్షల వరకు వేతనం అందుతోందని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. వరుసగా అమలు చేసిన పే రివిజన్ కమిషన్ (PRC) సిఫార్సుల వల్లే ఈ స్థాయిలో జీతాలు పెరిగాయని ఆయన వివరించారు.

Read Also: Greenfield Highway: మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం!

Gratuity amount: How govt employees can get gratuity up to Rs 25 lakh;  check details - BusinessToday
Senior Sweeper Salary: Sweeper salary in Telangana is Rs. 2 lakhs

రూ. 1,500 కోట్ల నుంచి రూ. 6,000 కోట్లకు..

రాష్ట్ర ఆవిర్భావ సమయం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఖజానాపై జీతాలు, పెన్షన్ల భారం ఎంతలా పెరిగిందో రామకృష్ణారావు గణాంకాలతో వివరించారు.

  • 2014లో: జీతాలు, పెన్షన్ల కోసం నెలకు కేవలం రూ. 1,500 కోట్లు మాత్రమే కేటాయించేవారు.
  • ప్రస్తుతం: ఈ వ్యయం భారీగా పెరిగి ప్రతి నెలా రూ. 6,000 కోట్లకు చేరింది. అంటే గత పదేళ్ల కాలంలో ఉద్యోగుల సంక్షేమం, వేతనాల పెంపు కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు నాలుగు రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. కేవలం స్వీపర్ జీతమే రూ.2లక్షల వరకు ఉండటంతో ఆశ్చర్యపోతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.