హైదరాబాద్: పింఛన్ లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా పెన్షన్ అందించేందుకు నూతన టెక్నాలజీని ఉపయోగించుకోవాలని, పింఛన్లు (Pensions) అందించడం సామాజిక బాధ్యత అన్నారు. చేయూత పెన్షన్ల పంపిణీపై ప్రజాభవన్లో మంత్రి సీతక్క (Seethakka) గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేదరిక నిర్మూలన కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా క్యాంటీన్లు ఇస్తున్నామని వెల్లడించారు.
పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా
ప్రమాద బీమా ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. 15 సంవత్సరాల వయస్సు నుంచే మహిళా సంఘాల్లో సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగు పడుతుందన్నారు. ఆర్టీసీలో 200 కోట్ల మహిళా ప్రయాణాలు జరిగాయంటే. మహిళలకు ఫ్రీ బస్సు (Free bus for women) బాగా ఉపయోగపడుతోందని, వారు ఫ్రీ బస్సు ఎక్కడమే కాదని, మహిళలను బస్సు ఓనర్లను చేసింది తమ ప్రభుత్వమే నన్నారు. పేదరికం తగ్గించకపోతే సమాజంలో అంతరాలు పెరుగుతాయని, నిజమైన లబ్దిదారులకు పింఛన్లు చేరే విధంగా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు.
సాంకేతిక కారణాలతో పింఛన్లు ఆలస్యం అయితే ముందే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫేషియల్ రికగైజేషన్ ద్వారా అర్హులకే పింఛన్లు అందుతోందన్నారు. ప్రతీ నెల రూ.1000 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షనే చేయూతని.. అదే వారి ధైర్యమన్నారు. ఈ క్రెడిట్ అంతా ఐఏఎస్ దివ్యాకే దక్కుతుందని, ప్రతీ అధికారి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాల న్నారు. అధికారు లూ పెన్షనర్ల కష్ట సుఖాలు తెలుసు కోవాలని, మానవ సేవే మాధవ సేవ అని మంత్రి సీతక పేర్కొన్నారు. సమావేశంలో సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్, డైరెక్టర్ గోపీ, జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ పాల్గొన్నారు .
మంత్రి సీతక్క పెన్షన్ పంపిణీపై ఏం పేర్కొన్నారు?
మంత్రి సీతక్క పేర్కొన్నదేమంటే, పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం వల్ల లబ్ధిదారులకు మరింత వేగవంతమైన, పారదర్శక సేవలు అందుతాయని స్పష్టం చేశారు. అందుకే ఈ విధానాన్ని ప్రభుత్వం స్వీకరించాలని ఆమె సూచించారు.
పెన్షన్ పంపిణీలో టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి?
- వేగవంతమైన లావాదేవీలు
- మానవ తప్పిదాల నివారణ
- లబ్ధిదారుల సమాచారం సులభంగా గుర్తింపు
- గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మొబైల్ టెక్నాలజీతో సులభతరం
- మళ్లీ మళ్లీ సర్టిఫికెట్ల అవసరం లేకుండా “ఇ-వెరిఫికేషన్”
Read hindi news: hindi.vaartha.com
Read also: Telangana Rain: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు