నేటి నుంచే అక్కౌంట్లలో జమ
హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుభవార్త చెప్పింది. ప్రభుత్వం చెప్పిన మేరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాల (Interest Free Loans) ను విడుదల చేసింది. ఈ మేరకు సెర్కు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది. దీనిలో రూ.300 కోట్లు గ్రామీణ మహిళ సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించింది.
ఈ నెల 18 వరకు ఖాతాల్లో వడ్డీ జమ
శనివారం నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ జమ (Interest credited to accounts) అవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Sitakka) ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులు సైతం ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తారని వివరించారు. బిఆర్ఎస్ హయంలో వడ్డీలేని రుణాలు నిలిచిపోయాయని తెలిపారు. రూ.3000 కోట్లకు పైగా బిఆర్ఎస్ సర్కార్ బకాయిలు పెట్టిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సకాలంలో వడ్డీలేని రుణాల చెల్లింపు జరుగుతోందని తెలిపారు. దీంతో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాల్లో అనూహ్య వృద్ధి జరుగుతుందని మంత్రి సీతక్క (Sitakka) ఆశాభావం వ్యక్తం చేశారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Bandi Sanjay: హిందూమతంపై భక్తి, చిత్తశుద్ధి ఉన్న వారికే ఉద్యోగాలు కల్పించాలి
Jishnu Dev Varma: భూతాపాన్ని తగ్గించేందుకు త్రిముఖ వ్యూహం – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ