📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Hyderabad: ఫామ్‌హౌస్‌లో గుట్టుగా డ్రగ్స్ పార్టీ

Author Icon By Vanipushpa
Updated: August 15, 2025 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్(Hyderabad) నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌(Formhouse).. ఆ ప్రాంగణంలో చాలా కార్లు ఆగి ఉన్నాయి.. వాళ్లు చూడటానికి ఇక్కడి వాళ్లు అస్సలే కాదు.. ఫుల్ సౌండ్.. డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కట్ చేస్తే.. పోలీసులు(Polices) ఎంట్రీ ఇచ్చారు.. ఇంకేముంది.. వాళ్ల అసలు బండారం బయటపడింది.. ఫామ్‌హౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుపుకుంటూ 51 మంది ఆఫ్రికన్లు పట్టుబడటం సంచలనంగా మారింది. వీరిలో 37 మంది మహిళలు ఉన్నారు. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలోని SKM ఫామ్‌హౌస్‌లో ఆఫ్రికన్ దేశస్తులు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

Hyderabad: ఫామ్‌హౌస్‌లో గుట్టుగా డ్రగ్స్ పార్టీ

హౌస్‌లో డ్రగ్స్, లిక్కర్ పార్టీ

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్, లిక్కర్ పార్టీ జరుగుతోందని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు నార్కోటిక్ బ్యూరో అధికారులతో కలిసి ఫామ్‌‌హౌస్‌‌పై దాడులు నిర్వహించారు. దీనిలో 51 మందికిపైగా ఆఫ్రికా దేశస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. SOT, పోలీసులు ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగుచూశాయి.

ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ

ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 51 మంది ఆఫ్రికన్లను అదపులోకి తీసుకున్నారు. అయితే, అందరికీ డగ్స్ పరీక్షలు నిర్వహించగా.. అందులో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది.. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారం అందించారు.. వారు కూడా అక్కడకు చేరుకుని వారి వీసాలను పరిశీలిస్తున్నారు. విదేశీయులు పార్టీకి పర్మీషన్ తీసుకున్నారా.. లేదా..? విదేశీ మద్యం, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దాదాపు 100 మంది పోలీసు బందోబస్తుతో బాకారం ఎస్కేఎం ఫామ్‌హౌస్‌లో సోదాలు కొనసాగుతున్నాయి.

పిల్లలపై మద్యం మరియు మాదకద్రవ్యాల ప్రభావాలు ఏమిటి?

సాధ్యమయ్యే ప్రభావాలలో ఇవి ఉన్నాయి: బలహీనమైన అభిజ్ఞా అభివృద్ధి , ఉదాహరణకు తగ్గిన ప్రేరణ నియంత్రణ. అభ్యాసం మరియు జ్ఞాపకశక్తి సమస్యలు వంటి నిరోధిత కార్యనిర్వాహక పనితీరు నైపుణ్యాలు.

మాదక ద్రవ్యాలను ఎలా అరికట్టాలి?

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి గురైన బాధితులకు సరైన పునరావాసం కల్పించే సామాజిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలి మరియు డ్రగ్స్ సరఫరా చేయడం వెనుక ఉన్నవారిని సామాజికంగా బహిష్కరించాలి. తమ పిల్లలతో ఎలా వ్యవహరించాలో మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగం నుండి వారిని దూరంగా ఉంచాలనే దానిపై తల్లిదండ్రులకు కూడా సలహా ఇవ్వాలి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/jk-pilgrims-killed-in-flash-floods-in-jammu-and-kashmir/crime/530620/

Crime News Drugs party Farmhouse Raid Latest News Breaking News Narcotics police investigation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.