📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Bandh : తెలంగాణ లో ఈరోజు స్కూళ్లు, కాలేజీలు బంద్ – ఎస్ఎఫ్ఎ

Author Icon By Sudheer
Updated: July 23, 2025 • 7:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగ సమస్యల పరిష్కారానికి సంబంధించి స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. విద్యా వ్యవస్థ వాణిజీకరణకు వ్యతిరేకంగా ఈ బంద్ చేపట్టినట్లు ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది.

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌ల విడుదలపై నిరసన

ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, తక్షణమే విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, స్కాలర్షిప్‌ మంజూరుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వం చర్యల ఆలస్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై స్పందించకపోతే ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందని హెచ్చరించారు.

విద్యాసంస్థలు బంద్‌కు సహకారం – తల్లిదండ్రులకు సమాచారం

ఈ బంద్‌కు ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు స్పందించాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపించి ఇవాళ సెలవు ప్రకటించాయి. ఫీజుల భారంతో విద్యార్థుల భవిష్యత్తు సంక్షోభంలో పడుతున్నదన్న అభిప్రాయంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు ఈ బంద్‌కు మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఎస్‌ఎఫ్‌ఐ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలపై బంద్ ప్రభావం చూపనుంది.

Read Also : ISKCON restaurant : ఇస్కాన్ రెస్టారెంట్ లో చికెన్ తిన్న యువకుడు క్షమాపణలు చెప్పాడు!

Google News in Telugu schools SFI SFI band sfi bandh sfi bandh colleges

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.