తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని (SC Classification Law) ‘రాజీవ్ యువ వికాసం’ (Rajeev Yuva Vikas) పథకంలో అమలు చేయనుందని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ ప్రకారం వివిధ ఉపవర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు
ఈ పథకానికి సంబంధించి మొత్తం 44,800 దరఖాస్తులు అందగా, వాటిని వర్గీకరణ చట్టంలోని విధానానికి అనుగుణంగా మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కేటాయించనున్నారు. గ్రూప్ A కి 1%, గ్రూప్ B కి 9%, గ్రూప్ C కి 5% రిజర్వేషన్ అమలు చేయనున్నారు. ఈ మేరకు ఎంపిక ప్రక్రియను కూడా మళ్లీ పునఃపరిశీలించనున్నారు.
ఉపాధి, శిక్షణ అవకాశాలు
అధికారుల ప్రకారం, ఈ దరఖాస్తులలో ఎక్కువగా గ్రూప్ B కు చెందిన అభ్యర్థుల నుంచే వచ్చాయని వెల్లడించారు. అందువల్ల సమానవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. రాష్ట్రంలోని ఎస్సీ యువతకు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన ఈ పథకం ద్వారా ఉపాధి, శిక్షణ అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.
Read Also : New Ration Card : తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డులు