తెలంగాణలో మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు (Sarpanch Elections) సంబంధించిన నామినేషన్లు పెద్ద ఎత్తున స్వీకరించారు. మొత్తం 189 మండలాల్లో 4236 పంచాయతీలు, అలాగే దాదాపు 37,400 వార్డుల కోసం నామినేషన్లు స్వీకరించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉంది. పలు జిల్లాల్లో చూసుకుంటే నామినేషన్లు (Sarpanch Elections) దాఖలు చేసేందుకు ఎక్కువమంది వచ్చారు.
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
ఈ క్రమంలోనే సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన వాళ్లందరి నుంచి నామినేషన్లు స్వీకరించారు. దీంతో రాత్రి వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. శనివారం ఒక్కరోజునే సర్పంచ్ స్థానాలకు 20 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు 50 వేలకు పైగా నామినేషన్లు వచ్చాయి.
సాంకేతికంగా చెల్లుబాటు అయ్యే నామినేషన్ల వివరాలను మాత్రమే అధికారులు ప్రకటిస్తారు. వీటిపై అప్పీళ్లను డిసెంబర్ 1వ తేదీన స్వీకరిస్తారు. 2వ తేదీన పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3వ తేదీ తుది గడువు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: