📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు మరింత జాప్యం!

Author Icon By Sharanya
Updated: February 13, 2025 • 10:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కొంత ఆలస్యంగా జరిగే అవకాశముంది. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం ఆమోదించింది. అలాగే కులగణనలో పాల్గొని వారికీ మరొకసారి అవకాశం కల్పించింది. అయితే కేంద్రం ఆమోదం తెల్పిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఎన్నికల వాయిదా కారణం?
గ్రామపంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలు కొంత కాలంగా అనిశ్చితిలోనే ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందాక పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి.

రాజకీయుల విశ్లేషక స్పందన: గతంలో పలువురు మంత్రులు కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పట్లో ఎన్నికలు జరిగేలా లేవు మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇది ప్రభుత్వ వ్యూహాత్మక నిర్ణయమని అంచనా వేస్తున్నారు.

ప్రజల్లో అసంతృప్తి: ఇప్పటికే తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మెుదలైంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు పలువురు ఆసక్తిదారులు సిద్ధమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని చోట్ల ప్రచారం కూడా మెుదలుపెట్టారు. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టోలు, సర్పంచ్ పదవి వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని ఆశగా చూస్తున్నారు

బీసీ రిజర్వేషన్ల అమలు, ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించి, మంత్రులు, ఉన్నతాధికారులతో దీర్ఘ చర్చలు జరిగాయి. చర్చల అనంతరం ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రం ఆమోదం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.

అసెంబ్లీ తీర్మానం తర్వాత కేంద్రం ఆమోదం అవసరం కేంద్రం ఆమోదం వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై నిర్ణయం తదుపరి ప్రక్రియ పూర్తి చేసి ఎలక్షన్ కమిషన్‌కు నివేదిక అందించాలి ఇదంతా పూర్తయిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం.

#bc reservation #cm revanthreddy #elections #sarpanch mptc elections #telengana Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.