తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పలు పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని(Sankranthi Gift) రాష్ట్ర రైతాంగానికి మరో శుభవార్తను ప్రకటించింది. గతంలో నిలిచిపోయిన రైతు యాంత్రికరణ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది.
Read Also: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
2026 జనవరిలో రైతు యాంత్రికరణ పథకం ప్రారంభం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం, 2026 జనవరిలో రైతు యాంత్రికరణ పథకాన్ని తిరిగి అమల్లోకి తీసుకురానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులకు సబ్సిడీపై ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించడం ఈ పథక ప్రధాన ఉద్దేశ్యం.
లక్ష 31 వేల మంది రైతులకు ప్రత్యక్ష లబ్ధి
ఈ పథకాన్ని పునరుద్ధరించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష 31 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి అమలు చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆహార భద్రత మిషన్ కింద సబ్సిడీపై పప్పుదినుసుల విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు.
జనవరిలో దరఖాస్తుల స్వీకరణ.. క్షేత్రస్థాయిలో అవగాహన
రైతు యాంత్రికరణ పథకానికి సంబంధించి జనవరిలో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రక్రియను(Sankranthi Gift) వేగవంతం చేసి అర్హులైన రైతులకు త్వరితగతిన యంత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనవరి తొలి వారంలో జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు మండలాల్లో పర్యటించి రైతులకు ప్రభుత్వ సబ్సిడీలు, యూరియా యాప్, యాంత్రికరణ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి
రైతుల ఆదాయాన్ని మరింత పెంచే దిశగా ఆయిల్ పామ్ సాగుపై కూడా అవగాహన పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వివరాలను రైతులకు వివరించి, ఈ పంట సాగు వైపు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను తెలుసుకుని క్షేత్రస్థాయిలో పరిష్కారాలు సూచించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: