📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sangareddy: ముగిసిన సర్పంచుల శిక్షణ కార్యక్రమం

Author Icon By Tejaswini Y
Updated: March 28, 2026 • 5:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sangareddy: చౌటకూర్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులకు గత ఐదు రోజులుగా కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో నిర్వహించిన శిక్షణకు మండలంలోని 15 మంది సర్పంచులలు హాజరయ్యారు. ఈ శిక్షణలో పాల్గొన్న సర్పంచులకు పంచాయతీ పరిపాలన, గ్రామాలాభివృ ద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాలాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడం, గ్రామ సభల నిర్వహణ, పంచాయతీ నిధుల వినియోగం, పారదర్శక పాలన, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అధికారులు వివరించారు.

Read Also: road accident: నిర్లక్ష్యానికి మూల్యం

అదేవిధంగా స్వచ్ఛ గ్రామాల నిర్మాణం, తాగునీటి నిర్వహణ, పారిశుధ్యం, హరితహారం, సంక్షేమ పథకాల అమలు విధానాలు వంటి విషయాలపై సర్పంచులకు మార్గదర్శకాలు వివరించారని సర్పంచులలు పార్కల రాంరెడ్డి, చిన్నరోళ్లపాటి అనసూయరాజశేఖర్, నందింకటి రామచంద్రారెడ్డి, జైపాల్నాయక్, గొల్ల మల్లేశంలు తెలిపారు. గ్రామాభివృద్ధిలో సర్పచుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజలకు చేరువగా ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ఈ శిక్షణ ముగింపు రోజున సర్పంచులకు సర్టిఫికెట్లను అందజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Choutakur Sarpanch Training Panchayat Administration Sangareddy News Telangana Sarpanch Training Village Development Plans

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.