Sangareddy: సాధారణంగా బస్సులో టికెట్ లేకపోతే అధికారులు ప్రయాణికుడిపై లేదా కండక్టర్‌పై కేసు పెడతారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. కేసు పెట్టకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఒక టికెట్ తనిఖీ అధికారికి (Ticket Squad), కండక్టర్, ప్రయాణికులు కలిసి దేహశుద్ధి చేసిన ఘటన రాయకోడ్ వద్ద కలకలం రేపింది.
Read Also:Hyderabad: ప్రభుత్వం చేతిలో హైదరాబాద్ మెట్రో.. సామానాలకు ఊరటనిచ్చేనా?
Sangareddy: అసలేం జరిగింది?
హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును సంగారెడ్డి జిల్లా రాయకోడ్ సమీపంలో టికెట్ స్క్వాడ్ అధికారులు తనిఖీ కోసం ఆపారు. తనిఖీల్లో ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేదని గుర్తించారు. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయాల్సిన అధికారి, అడ్డదారి తొక్కాడు. కేసు బుక్ చేయకుండా ఉండాలంటే ప్రయాణికుడితో పాటు కండక్టర్ కూడా కలిసి రూ. 20 వేల లంచం ఇవ్వాలని సదరు అధికారి డిమాండ్ చేశాడు. డ్యూటీలో ఉండి లంచం అడుగుతావా అంటూ ఆగ్రహించిన కండక్టర్, ఏకంగా తన చెప్పు తీసి సదరు అధికారిని కొట్టాడు. అధికారి తీరుపై ఆగ్రహంగా ఉన్న ప్రయాణికులు కూడా కండక్టర్‌కు మద్దతుగా నిలిచి, తనిఖీ అధికారిపై దాడికి దిగారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: