📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ratnapuri College Students Assault: చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

Author Icon By Siva Prasad
Updated: March 10, 2026 • 11:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ratnapuri College Students Assault: చదువు చెప్పాల్సిన గురువు కసాయిలా మారాడు. హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో విద్యార్థులను కేబుల్ వైరుతో చితకబాదిన అమానుష ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రత్నపురి కళాశాలలో మంగళవారం చోటుచేసుకుంది.

Read Also: Warangal crime: విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

కేబుల్ వైరుతో దాడి

హత్నూర మండలం తూర్కలఖానాపూర్ గ్రామ శివారులోని రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో సీఎస్ఈ (CSE) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై హెచ్ఓడీ (HOD) శివారెడ్డి విచక్షణారహితంగా దాడి చేశారు. హోంవర్క్ పూర్తి చేయలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన, కేబుల్ వైరుతో విద్యార్థులను చితకబాదినట్లు బాధితుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపించారు.

Ratnapuri College Students Assault: గాయపడ్డ విద్యార్థులు

ఈ దాడిలో సాత్విక్, సందీప్, వినయ్, మహేష్, రామ్, సాయి కిరణ్, నవదీప్ సహా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థుల వీపులపై తగిలిన వాతలు చూసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులపై ఇలాంటి కఠినమైన దాడులు చేయడం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు.

Ratnapuri College Students Assault

పోలీసుల వివరణ

ఈ ఘటనపై హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డిని వివరణ కోరగా, ఇప్పటివరకు తమకు బాధితుల నుండి ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యం కూడా ఈ విషయంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

HOD Shiva Reddy Ratnapuri College News Ratnapuri Institute of Technology Sangareddy College Student Assault Sangareddy crime news Student Torture Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.