📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం

Sangareddy: విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం

Author Icon By Saritha
Updated: January 3, 2026 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తనపై ఫిర్యాదు చేశారన్న కోపంతో..

సంగారెడ్డి జిల్లా (Sangareddy) సిర్గాపూర్‌లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారిని వేధిస్తున్న వార్డెన్ కిషన్ నాయక్ ప్రవర్తన సంచలనం సృష్టించింది. అతడి తీరుతో విసిగిపోయిన విద్యార్థులు గురువారం రాత్రి కడ్పల్–సిర్గాపూర్ రహదారిపై ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే హాస్టల్‌కు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వార్డెన్‌పై తమ ఆరోపణలను రాతపూర్వకంగా ఫిర్యాదుగా అందజేశారు. ఘటనపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read also: Telangana Assembly : రేపు అసెంబ్లీలో కృష్ణా జలాలపై ప్రభుత్వం PPT

వార్డెన్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్

దీంతో ఆగ్రహానికి గురైన వార్డెన్, (Sangareddy) శుక్రవారం ఉదయం మద్యం మత్తులో వసతి గృహానికి చేరుకుని విద్యార్థులపై బూతులతో రెచ్చిపోయాడు. అంతటితో ఆగకుండా, హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి.. నా మీదనే ఫిర్యాదు చేస్తారా? వాళ్ల అన్నంలో విషం కలిపి చంపేయండి అంటూ ఆదేశాలు జారీ చేశాడు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగ్ బయటకు రావడంతో సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఉదంతంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడాలని చూసిన వార్డెన్ కిషన్ నాయక్‌ను సస్పెండ్ (Suspended) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Kishan Naik Poison in Food sangareddy SC Welfare Hostel Sirgapur Telangana news Warden Suspended

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.