📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Sanathnagar TIMS hospital : సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

Author Icon By Sai Kiran
Updated: February 7, 2026 • 9:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sanathnagar TIMS hospital : హైదరాబాద్ నగరంలోని Telangana Institute of Medical Sciences (TIMS) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని Sanathnagar లో మార్చి నెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి, రోడ్లు–భవనాల శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆసుపత్రిని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. అన్ని పనులు ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు స్పష్టమైన డెడ్‌లైన్ విధించారు.

వైద్య విద్య డైరెక్టర్ (DME), TGMSIDC, MCHIDC, ఆర్&బీ ఇంజనీర్లు, అలాగే Megha Engineering & Infrastructures ప్రతినిధులతో కలిసి ఆసుపత్రిలోని అన్ని అంతస్తులను ఆయన పరిశీలించారు. ఎమర్జెన్సీ వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, సెంట్రల్ స్టెరైల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ (CSSD)లో జరుగుతున్న పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

Read Also: Soil testing : భూసార పరిరక్షణతోనే సాగు ముందడుగు

Sanathnagar TIMS hospital

ఈ నెలాఖరులోగా 200 ఆక్సిజన్ లైన్లు, 65 నర్సింగ్ స్టేషన్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఎమర్జెన్సీ విభాగానికి RO ప్లాంట్ వంటి కీలక ఏర్పాట్లు పూర్తిచేసి ట్రయల్ రన్స్‌కు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి అంతటా సైన్‌బోర్డులు, లాండ్రీ సేవలు, కర్టెన్లు, ఐసీయూ బెడ్ రైలింగ్స్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.

ఆసుపత్రి ప్రారంభానికి అవసరమైన పరికరాల్లో చాలా వరకు ఇప్పటికే అమర్చినట్లు అధికారులు తెలిపారు. మరో 540 రకాల వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ట్రయల్ రన్స్ పర్యవేక్షణ కోసం తొలి దశలో ఫిబ్రవరి 12 నుంచి 28 మధ్య 100 మంది వైద్య, పారామెడికల్, హౌస్‌కీపింగ్ సిబ్బందిని నియమించనున్నట్లు వైద్య విద్య డైరెక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం 1,059 గదుల్లో 225 గదుల తనిఖీ పూర్తయిందని, తనిఖీ పూర్తైన గదుల్లో వెంటనే బెడ్లు, పరికరాల అమరిక ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu Hyderabad government hospital update Latest News in Telugu MEIL hospital project Sanathnagar hospital news Sanathnagar TIMS hospital super speciality hospital Telangana Telangana Institute of Medical Sciences Telugu News TIMS Hyderabad opening TIMS recruitment doctors

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.