📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Sammakka-Saralamma: మేడారంలో అమ్మవార్లకు గుడి ఎందుకు కట్టలేదంటే ?

Author Icon By Saritha
Updated: January 30, 2026 • 1:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేడారం(Medaram) సమ్మక్క-సారలమ్మ (Sammakka-Saralamma) అమ్మవార్లకు మండపాలు కట్టలేదు! విగ్రహాలు ప్రతిష్ఠించలేదు! వేద మంత్రాలు లేవు! కానీ, భక్తుల గుండెలే వారికి కోవెలలు. గద్దెలపై ఉన్న వెదురు కర్ర, కుంకుమభరిణిలే వనదేవతల ప్రతిరూపాలు. అన్యాయంపై తిరగబడ్డ ఆడ బిడ్డలు అమరులైన చరిత్రకు ప్రతీక ఈ మేడారం జాతర. తల్లుల త్యాగాన్ని తలుచుకుంటూ వందల ఏళ్లుగా చేసుకుంటున్న వేడుక ఇది. 

ఆదివాసీల సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. అడవి ధిక్కార స్వరానికి సజీవ సాక్ష్యం. అందుకే, వనం వీడి జనం మధ్యకొచ్చే వనదేవతలను కొలిచేందుకు లక్షలాది భక్తులు తండోపతండాలుగా వస్తారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. అంతటి ప్రాముఖ్య ఉంది మేడారం మహా జాతరకు.

Read Also: Medaram: ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

Why was a temple not built for the goddesses in Medaram?

గుడి లేకపోవడానికి కారణం

మేడారంలో సమ్మక్క-సారలమ్మలకు (Sammakka-Saralamma) శాశ్వత గుడి (ఆలయం) లేకపోవడానికి ప్రధాన కారణం వారిది గిరిజన సాంప్రదాయం కావడం, ఆదివాసీ ఆచారాల ప్రకారం దేవతలు ప్రకృతిలో, గద్దెలపై కొలువై ఉంటారని నమ్మడం. విగ్రహాలకు బదులుగా పసుపు, కుంకుమ, చిలకల గుడ్డ (వస్త్రం) మరియు గద్దెలను (పీఠాలు) పూజిస్తారు, ఇది వారి ఆత్మాభిమానం మరియు సంస్కృతికి ప్రతీక.  సమ్మక్క-సారలమ్మ గిరిజన దేవతలు, వారి పూజలు ప్రకృతిలో చెట్ల కింద, గద్దెల మీదనే జరగాలనేది ఆచారంగా వస్తోంది. శాశ్వత గుడికి బదులుగా, కేవలం జాతర సమయంలోనే చెక్కతో గద్దెలను (పీఠాలను) నిర్మించి, అమ్మవార్లను ప్రతిష్ఠిస్తారు.ప్రకృతిని దేవుడిగా భావించే ఆదివాసీలు, స్థిరమైన, బంధిత కట్టడాలను ఇష్టపడరు.  

కాకతీయ రాజులు మేడారంపై మాఘ శుద్ధ పౌర్ణమి సమయలోనే దాడి చేశారని చెబుతారు. నిండు పౌర్ణమి రోజున జరిగిన యుద్ధంలో సమ్మక్కతో పాటు భర్త పగిడిద్దరాజు, బిడ్డ సారలమ్మ, కొడుకు జంపన్న, అల్లుడు గోవిందరాజులు తనువు చాలించారు. అందుకే  మాఘ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే బుధవారం నుంచి 4 రోజుల పాటు వనదేవతల జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకొనే సాంప్రదాయం వచ్చింది. ఈ నాలుగు రోజులు గద్దెల మీద అమ్మవార్లు కొలువై ఉంటారని నమ్ముతారు. ఆ సమయంలో నిండుపున్నమి వెన్నెల గద్దెలమీద పడుతుంది. అలా పడడం వల్ల దేవతల శక్తి మరింత ఇనుమడిస్తుందని వారు నమ్ముతారు. గుడి కట్టడం వల్ల వెన్నెల గద్దెలపై పడే అవకాశం ఉండదు కనుక గుడి కట్టడానికి గిరిజనులు అంగీకరించరు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Latest News in Telugu medaram Sammakka-Saralamma Jatara Telangana Telugu News tribal festival Tribal Traditions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.