తెలంగాణ (TG) మేడారం జాతర ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న వనదేవతల జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. (Sammakka Saralamma) జాతర నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొబ్బరికాయ మొదలు అమ్మలకు సమర్పించే బంగారం (బెల్లం), కోళ్లు, మేకల ధరలతో పాటు, ఇళ్లు, ప్రత్యేక గదుల అద్దెలను భారీగా పెంచి భక్తులను దోచుకుంటున్నారు. ఆఖరికి చెట్టు నీడకు కూడా కిరాయి వసూలు చేస్తున్నారంటే జాతరలో దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు.
Read Also: Sammakka Saralamma: మేడారంలో మేకలకు టికెట్ వసూలుపై భక్తుల ఆగ్రహం
మరింత పెరగనున్న ధరలు
మేకపోతు లైవ్ కిలో రూ. 420 ఉండగా, మేడారంలో మాత్రం రూ. 900 నుంచి రూ. 1000 వరకు అమ్ముతున్నారు. మటన్ ధర రూ. 1500 వరకు పలుకుతోంది. బయట రూ. 170-180 కి దొరికే కిలో కోడిని జాతర దగ్గర రూ. 300-350 వరకు అమ్ముతున్నారు. (Sammakka Saralamma) మొన్నటి వరకు కూడా కిలో రూ. 350-400 ఉన్న నాటుకోడిని ఇప్పుడు రూ. 700లకు అమ్ముతున్నారు. జాతర చివరి మూడు రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇళ్ల అద్దెలు కూడా భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. కనీస వసతి సౌకర్యాలు లేకపోయినా సరే అద్దెలు ఆకాశాన్నంటాయి.
గదులు దొరకని వారు చెట్ల నీడలో సేదతీరడానికి ప్రయత్నిస్తుండగా, తోట యజమానులు వాటికి కూడా అద్దెలు వసూలు చేస్తున్నారు. జాతరకు దగ్గరలో తోటలున్న స్థానికులు భక్తులకు చెట్లను అద్దెకు ఇస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి ఒక్కో చెట్టుకు రూ. 1000 చొప్పున వసూలు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: