📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CM Revanth Reddy : నేడు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

Author Icon By Sai Kiran
Updated: September 23, 2025 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Revanth Reddy : సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధి పనులను ప్రారంభించడానికి, అలాగే గద్దెల ప్రాంగణం విస్తరణ మరియు డిజైన్లపై సమీక్ష చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం మేడారం రానున్నారు.

ప్రతి రెండేళ్లకోసారి జాతర ప్రారంభానికి ముందు చేపట్టే అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం సీఎం రావడం ఇది తొలిసారి కావడం విశేషం. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనుందని ప్రకటించిన జాతరలో భక్తులకు పలు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.150 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో శాశ్వత అభివృద్ధి పనులు, అలాగే ప్రకృతి దైవాలైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

ప్రస్తుతం సమ్మక్క, సారలమ్మ గద్దెలు ఒక వరుసలో ఉంటున్నాయి. భక్తులు క్యూ లైన్‌లో సమ్మక్క, సారలమ్మ దర్శించుకుని, తరువాత పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్దకు రావడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు నలుగురు గద్దెలను ఒకే వరుసలో నిర్మించాలనుకుంటున్నారు. గద్దెల చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్స్‌ను తొలగించి, వాటిని గ్రానైట్‌తో నిర్మించాలనుకుంటున్నారు.

గిరిజన పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, నాలుగైదు రకాలుగా గద్దెల డిజైన్లు రూపొందించారు. సీఎం రేవంత్‌ సమీక్షలో ఒక డిజైన్‌ను ఖరారు చేసి, శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం 32 గుంటల్లో తల్లుల గద్దెల ప్రాంగణం ఉండగా, నాలుగు వైపులా మరో 20 అడుగుల మేర విస్తరించాలని భావిస్తున్నారు. గద్దెల విస్తరణ, అతిథి గృహాల నిర్మాణానికి మొత్తం 23 ఎకరాల భూమిని సేకరించనున్నారు.

జంపన్న వాగుపై నీరు ఎప్పటికీ నిలిచేలా రెండు, మూడు చోట్ల చెక్ డ్యామ్‌లు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, గత అనుభవాల కారణంగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా జంపన్న వాగులో నిరంతం నీరు ప్రవహించేలా ప్రణాళిక రూపొందించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం పర్యటనలో భాగంగా ఐలాపూర్ వరకు రోడ్డు నిర్మాణం, జాతర ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనుల భూమి పూజ చేయనున్నారు.

మేడారం ఆలయ విస్తరణపై సూచనలు

మేడారం ఆలయ విస్తరణపై అధికారులు, మాస్టర్ ప్లాన్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ ఆవరణలోని చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణను కొనసాగించాలని సూచించారు. జాతరలో 2026 మహా జాతర ప్రారంభానికి ముందు అన్ని పనులు పూర్తవ్వాలని అధికారులకు ఆదేశించారు.

అలాగే, సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం విస్తరణ, పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు సీఎం రేవంత్‌రెడ్డి 68 కేజీల బంగారం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read also :

2026 Maha Jatara Breaking News in Telugu CM Revanth Reddy Gadde Pranganam development Gold Offering Google News in Telugu Latest News in Telugu Medaram Temple Pilgrim facilities Sammakka Saralamma Jatara special poojas Telangana Jatara updates Telugu News Temple expansion Temple renovation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.