📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

Sambasiva Rao: మోదీపై కూనంనేని వ్యాఖ్యలు..స్పందించిన కిషన్ 

Author Icon By Saritha
Updated: January 3, 2026 • 5:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై(Narendra Modi) సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Sambasiva Rao) వ్యక్తిగత దూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలు హేయమైనవని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, దేశాభివృద్ధికి అహోరాత్రులు శ్రమిస్తూ, అంతర్జాతీయస్థాయిలో భారతదేశ గౌరవాన్ని పెంచుతున్న నాయకుడు మోదీ అని కొనియాడారు.

Read also: Pawan Kalyan: వంద మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలు

అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్న కిషన్ రెడ్డి

అలాంటి ప్రధానిపై కూనంనేని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దివాలాకోరుతనాన్ని బయటపెట్టాయని విమర్శించారు. (Sambasiva Rao) ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కూనంనేని వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య విలువలపై, రాజకీయ వ్యవస్థపై ఏవగింపు కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయకుండా, సభా మర్యాదలు పాటించేలా చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డి సభాపతిని కోరారు. కాగా, కూనంనేని సాంబశివరావు శాసనసభలో మాట్లాడుతూ, మోదీ మైండ్‌ను టెస్ట్ చేయించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:


BJP CPI Kishan Reddy kunamneni sambasiva rao Latest News in Telugu Narendra Modi Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.