హన్మకొండ: మధ్యవర్తిత్వం అనేది కక్షిదారులు ఐచ్ఛికంగా సహకరించుకొని వివాదా లను పరిష్కరించుకొనే ఒక ప్రక్రియ హైకోర్టు న్యాయ మూర్తి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. సామ్ కోషి(Sam Koshi) అన్నరు. మధ్యవర్తిత్వం ద్వారా (Through mediation) కోర్టులలోని కేసులను గణనీయంగా తగ్గియాలని హైకోర్టు న్యాయమూర్తి పి. సామ్ కోషి (Sam Koshi) పిలుపునిచ్చారు.
న్యాయవాదులకు ’40’ గంటల శిక్షణా కార్యక్రమం లో హై కోర్టు జస్టిస్
ఉమ్మడి వరంగల్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాచు, మహబూబబాద్ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల న్యాయ సేవా సంస్థలు గుర్తించిన మధ్యవర్తిత్వం భావన, సాం కేతికతలపై సాధికారత పొందిన న్యాయవాదులకు ’40’ గంటల శిక్షణా కార్యక్రమం వివరణ కార్యక్రమంలో హై కోర్టు జస్టిస్ పాల్గొన్నారు. హన్మకొండ సుబేదారిలోని డి.సి.సి. బ్యాంక్లో జస్టిస్ పి. సామ్షి, హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ, హైదరా బాద్ కార్యనిర్వాహక చైర్మన్ మాట్లాడుతూ.. మధ్య వర్తిత్వం ప్రపంచీకరించబడిందని, మధ్యవర్తిత్వం కోర్టుల భారాన్ని(Mediation reduces burden the courts) చాలావరకు తగ్గిస్తుందని వ్యక్తం చేశారు. శిక్షణ పొందిన మధ్యవర్తులు వారి ఆపారమైన అనుభవంతో న్యాయవాదులను మధ్యవర్తిగా మెలకువలు నేర్పుతారని సూచించారు.
మధ్యవర్తిత్వం ద్వారా సమయం, డబ్బు ఆదా
మధ్యవర్తిత్వం మొత్తం చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్ళకుండానే పార్టీల వివాదాలను పరిష్కరించడానికి అవకాశాలను అందిస్తుంది. కార్పొరేట్లు, వ్యాపారాలు, కంపెనీలు మొదలైనవన్నీ వారి వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయిస్తున్నారు అని తెలిపారు. మధ్యవర్తిత్వం మరియు రాజీ అనేది రెండు పార్టీల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి సమర్ధవంతమైన సాధనం, జరువైపుల నుండి ఎటువంటి బాహ్య ఒత్తిళ్లు లేకుండా వారి వివాదాలను పరిష్కరిం చుకోవడానికి వారికి ఒక వేదికను అందిస్తుంది. అని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుంది మరియు వారి మధ్య శాంతి మరియు సామరస్యాన్ని తెస్తుంది. ఇది కక్షి దారులకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో మధ్యవర్తిత్వం వేగంగా అభివృద్ధి చెందడానికి ప్యానల్ న్యాయవాదులు మరియు పారా లీగల్ వాలంటీర్లు సేవలను అందించాలని సూచించారు. ఈ 40 గంటల శిక్షణ కార్యక్రమాన్ని న్యాయవాదులు సద్వినియోగ పరచుకొని, మెళకువలు నేర్చుకొని కోర్టులలోని కేసుల కక్షిదారులను మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కుదుర్చుకునే విధంగా ప్రయత్నించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జే శ్రీనివాసరావు మాట్లాడుతూ” కక్షి దారులు తమంతట తామే వాళ్ల కోపతాపాలను వదిలిపెట్టుకొని, సమస్యలను పరిష్కరించే విధంగా మధ్యవర్తిత్వం పనిచేస్తుందని తెలిపారు. మధ్యవర్తిత్వం అత్యధిక వివాదాలను పరిష్కరించు కోవడానికి సహాయపడుతుంది అని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా వాణిజ్య సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు చెడిపోకుండా ఉంటుంది. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు పి.బి. నిర్మలా గీతాంబ, డాక్టర్ పట్టాభిరామా రావు ఇతర జిల్లా న్యాయమూర్తులు నారాయణ బాబు, మనీషా శ్రావణ్ ఉన్నమ్, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం. సాయి కుమార్, క్షమా దేశ్ పాండే, బార్ కౌన్సిల్ మెంబర్లు దుస్స, జనార్ధన్, భైరపాక జయాకర్,, వరంగల్ హనుమకొండ జిల్లాల న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వలుస సుధీర్, వులి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: