📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Saleshwaram Jatara: సలేశ్వరం జాతరకు భక్తుల సందడి..6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్

Author Icon By Sharanya
Updated: April 13, 2025 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సలేశ్వరం జాతరకు ఈసారి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి సందర్భంగా జరిపే ఈ జాతర, నల్లమల అటవీ ప్రాంతంలోని లోయలలో ఉన్న లింగమయ్య స్వామి దర్శనానికి భక్తులను ఆకర్షిస్తుంది.

తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం

ఈ యాత్రకు తెలంగాణ అమర్‌నాథ్ యాత్ర అనే పేరుంది. గుహలో వెలసిన లింగమయ్య స్వామి దర్శనం కోసం సాహసోపేతమైన అడవి మార్గాన్ని భక్తులు అధిగమించాలి. ఇది భక్తులకు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాక, సాహస ప్రయాణం కూడా. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న దట్టమైన అడవులు, కొండలు, కోనలు, జలపాతాలు భక్తులకు ఒక రమణీయ దృశ్యంను అందిస్తాయి. నల్లమల అటవీప్రాంతం తాలూకు ప్రకృతి సౌందర్యం భక్తులకు విశేష అనుభూతిని కలిగిస్తుంది.

శ్రీశైలం ఘాట్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్

జాతరకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మన్ననూర్ చెక్‌పోస్టు నుంచి సిద్ధాపూర్ వరకు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుస సెలవులు, పండుగ దినాల కారణంగా లక్షల సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చారు. భక్తుల రాకతో అటవీశాఖ టోల్ వసూలు కేంద్రం వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒకే మార్గంగా వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో, టోల్ చెల్లించే ప్రక్రియ ఆలస్యం కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ వాలంటీర్లు, అటవీ శాఖ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ జాతర మూడు రోజుల పాటు జరగడం, చివరి రోజు ఆదివారంగా ఉండటంతో భక్తుల సంఖ్య అత్యధికంగా ఉంది. ఆదివారంతో జాతర ముగియనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు రోజులు కూడా ట్రాఫిక్, భద్రత సమస్యలు కొనసాగే అవకాశముంది. ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా మూడు రోజులపాటు సలేశ్వరం జాతర నిర్వహిస్తుంటారు. ఈ నేల 11న ప్రారంభమైన జాతర ఆదివారంతో ముగినుంచిది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. చుట్టూ అడవి.. కొండలు,కోనలు, జలపాతాలు ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు. ఈ జాతరను సాహసోపేత తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలుస్తారు.

#DevotionalTrip #LingamayyaDarshan #SaleshwaramJatara #SriSailamGhatRoad #TelanganaAmarnath #telengana #TrafficJam Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.