📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sajjanar: అలా చేస్తే వదిలేదే లేదు..లక్కీ డ్రా ఇన్‌‍ఫ్లుయెన్సర్ల హెచ్చరిక

Author Icon By Saritha
Updated: January 17, 2026 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లక్కీ డ్రా పేరుతో అమాయకులను మోసం చేస్తున్న సోషల్ మీడియా (Social media) ఇన్‌ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కార్లు, ప్లాట్లు ఇస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read also: Ward Reservations: నారాయణఖేడ్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరిక

సామాజిక మాధ్యమాల్లో లక్కీ డ్రా పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. (Sajjanar) రీల్స్‌లో బిల్డప్… రియాల్టీలో ఫ్రాడ్, లక్కీ డ్రా ఇన్‌‍ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త అంటూ ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించారు. లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లను విశ్వసించవద్దని ప్రజలకు సూచించారు. ఇలాంటి ప్రైజ్ చిట్స్, లక్కీ డ్రాలు నిర్వహించడం భారత రాజ్యాంగం ప్రకారం నేరమని ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారు. ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్-1978 ప్రకారం కేసులు నమోదు చేస్తాం. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. మోసాలకు పాల్పడే వారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా సరే.. ఎవరినీ ఉపేక్షించేది లేదు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవు. అని సజ్జనార్ హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



fraud Hyderabad Police Latest News in Telugu Lucky Draw online scams India sajjanar social media influencers Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.