హైదరాబాద్ నగర సీపీ వీ.సీ. సజ్జనార్ (Sajjanar) టాస్క్‌ఫోర్స్ పోలీసులకు షాక్ ఇచ్చారు. ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులపై అవినీతీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా 80 మంది సిబ్బందిని బదిలీ చేశారు. కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు ర్యాంక్ అధికారులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్‌ఫోర్స్ ప్రక్షాళన కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
Read Also: CM Revanth: రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్
బదిలీల అనంతరం మీడియాతో మాట్లాడిన సీపీ సజ్జనార్ (Sajjanar) .. నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజలు రోజుకు సుమారు కోటి రూపాయలు సైబర్ మోసగాళ్ల చేతిలో పోగొట్టుకుంటున్నారని ఆయన వెల్లడించారు.
1930 లేదా 100 నంబర్‌కు కాల్ చేయాలి
సైబర్ నేరగాళ్లు ప్రధానంగా పెట్టుబడి పేరుతో ఆశ చూపి లేదా డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి డబ్బులు గుంజుతున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలు జరుగుతున్నాయి. రాబోయే క్రిస్మస్, సంక్రాంతి పండుగల సమయంలో వచ్చే నకిలీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని,
ఎటువంటి అనధికార యాప్‌లను (APK Files) డౌన్‌లోడ్ చేయకూడదని సూచించారు. మోసం జరిగిన వెంటనే 1930 లేదా 100 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా సీపీ స్పందించారు. ఈ కేసును విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా విచారణ వేగంగా సాగుతోందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: