📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Sajjanar: పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. సజ్జనార్ ఏమన్నారంటే ?

Author Icon By Saritha
Updated: January 2, 2026 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బతికి గెలవాలని, పారిపోయి ఓడిపోవద్దని హైదరాబాద్ (HYD) సీపీ సజ్జనార్ (Sajjanar) ‘ఎక్స్’ వేదికగా సూచించారు. పిల్లలను పెంచలేక కన్నవారే వారికి విషమిచ్చి చంపిన ఘటనపై రెండు వార్తా క్లిప్పింగ్‌లను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. క్షణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. దయచేసి ఆలోచించండి అని విజ్ఞప్తి చేశారు.

Read also: Telangana: ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు: హరీశ్‌రావు

క్షణికావేశంలో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచన

నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు శాశ్వతంగా మూసుకుపోయాయి. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయి. గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే ఇలా మారితే ఆ పసిప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు? నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని ఆ చిన్నారులకు ఏం తెలుసు? అమ్మ కొంగు ఉరితాడవుతుందని ఆ అమాయకులకు ఏం ఎరుక? కష్టాలు సునామీలా వచ్చినా సరే ఎదురీదాలే తప్ప, ఇలా పసిమొగ్గలను చిదిమేయడం పిరికితనం, పాపం, క్షమించరాని నేరం అని ఆయన పేర్కొన్నారు. చనిపోవడానికి ఉన్న ధైర్యం బ్రతకడానికి, పోరాడటానికి ఎందుకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, అది మీపై ఆధారపడ్డ వారికి తీరని ద్రోహమవుతుందని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్త మృతితో పిల్లల్ని పోషించలేక వారికి విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. (Sajjanar) ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఘటనలో నంద్యాల జిల్లాలో తన ముగ్గురు పిల్లలకు ఓ తండ్రి విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలను పంచుకుంటూ ఆయన ట్వీట్ చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also: 

child safety Hyderabad CP Sajjanar Latest News in Telugu Parenting Responsibility social awareness Suicide Prevention Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.