Sadasivpet Road Accident: సదాశివపేట బైపాస్ వద్ద ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

Read Time:  1 min
Sadasivpet Road Accident: సదాశివపేట బైపాస్ వద్ద ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
FONT SIZE
GET APP
Sadasivpet Road Accident: Accident at Sadasivpet Bypass.. Lorry hits RTC bus
Sadasivpet Road Accident: Accident at Sadasivpet Bypass.. Lorry hits RTC bus

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శనివారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 65 (NH 65)పై గల బైపాస్ రోడ్డులోని ప్రమాదకరమైన మూలమలుపు వద్ద ఒక ఆర్టీసీ బస్సు, లారీ పరస్పరం బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

Read Also: Hapur Adulterated Sweets Incident: ఫ్రీ అయితే ఫినాయిల్ అయినా పర్లేదా?

15 మందికి తీవ్ర గాయాలు.. సహాయక చర్యలు ముమ్మరం

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సదాశివపేట పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.