Rythu Bharosa Update: మూడో వారంలో రైతు ఖాతాల్లో నిధుల జమ

Read Time:  1 min
Rythu Bharosa Update: మూడో వారంలో రైతు ఖాతాల్లో నిధుల జమ
FONT SIZE
GET APP

మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతు భరోసా పంపిణీ

హైదరాబాద్ : ఈ యాసంగి జేసీజన్ రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురు చూపులు త్వరలో ఫలించనున్నాయి. కాటిలైట్ ఆధారిత పంట సాగు ప్రక్రియ తర్వాత రైతు భరోసా(Rythu Bharosa Update) పథకం కింద యాసంగి సాగుకు పంట పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేస్తామని ఇప్పటి వరకు ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే శాటిలైట్ సర్వే పూర్తయిందని, ఈ నెల 6న ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం పంపిణీపై కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం.

Read Also: Medak Municipal Election: కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం: పద్మాదేవేందర్ రెడ్డి

Rythu Bharosa Update: Funds deposited in farmers' accounts in the third week
Rythu Bharosa Update: Funds deposited in farmers’ accounts in the third week

మున్సివల్ ఎన్నికల ప్రచారం

తాజాగా మున్సివల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మిర్యాలగూడలో నిర్వహించిన బహిరంగసభలోనూ మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతు భరోసాను పంపిణీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల మూడో వారం నుంచి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి శాటిలైట్ సర్వేలో పంటల సాగు విస్తీర్ణం 8 నుంచి 12శాతం మేర తగ్గుతోండని వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సారి రైతు భరోసా పథకం కింద లబ్దిదారుల సంఖ్య తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాసంగి సాగు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగానైనా సమృద్ధిగా కురవడంతో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి.

60 లక్షల ఎకరాల్లో వరి సాగు

ఈ ఏడాది అక్టోబరు చివరి వరకు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో చెరువులు, బావులు, బోరు బావుల కింద పెద్ద ఎత్తున వరి సాగవుతోంది. దాదాపు 60లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతున్నట్టు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. వరి నాట్లు 98శాతం మేర పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వరి, మొక్కజొన్నకు ఎరువులు, ఇతర సస్యరక్షణ చర్యలకు గాను పురుగుమందులు, దున్నకం ట్రాక్టర్ల అద్దె చెల్లించేందుకు పెట్టుబడి డబ్బుల్లేక రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు.. మరికొంతమంది అన్నదాతలు తమ వద్ద ఉన్న బంగారం. తాకట్టు పెట్టి మరీ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి.

అదేవిధంగా కేంద్రప్రభుత్వం అయిదు ఎకరాల లోపు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి పథకం(Kisan Samman Nidhi Scheme) కింద విడతకు రూ.2వేల చొప్పున మూడు విడతల్లో అందించే 6వేల పెట్టబడి సాయం కూడా రైతుల ఖాతాల్లో జమ కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నెల చివరికల్లా 22వ విడత కిసాన్ సమ్మాన్ నిధి రూ.2 వేలను రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేయనున్నట్టు సమా చారం. కేంద్ర బడ్జెట్ కారణంగా పీఎం కిసాన్ నిధుల విడుదల ఆలస్య మైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల చివరివారం వరకు రైతు లకు వంట పెట్టుబడి కోసం ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.