Rythu Bharosa New Applications: రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం అందని రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. కొత్తగా రైతుల నుంచి రైతు భరోసాకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. కొత్తగా పట్టా పొందిన రైతులు (ఈ యేడాది ఫిబ్రవరిలోపు పట్టా పొందిన) ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చనని తెలిపింది. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందినవారు రైతు భరోసా పథకంకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also: Southwest Monsoon: ఈ యేడాది అనావృష్టి ఎల్నినోతో నైరుతిపై ప్రతికూలం
ఇందుకోసం అర్హత కలిగిన అన్నదాతలు రైతు వేదికల వద్ద లేదా వ్యవసాయ కొస్తరణ అధికా రులను కలిసి అప్లికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు రైతులు తమ ఆధార్ కార్డు, కుట్టా పాస్ పుస్తకం, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ లను రైతు భరోసా అప్లికేషన్ ఫారంతోపాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల్లో అందజేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పట్టాలు పొందిన వారు వెంటనే రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
రైతు భరోసా పథకం కింద ప్రతీ యేటా ఎకరాకు రూ.12 వేలను రెండు విడతల్లో రూ.6వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది యాసంగి సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని మార్చి 22 నుంచి మూడు విడతల్లో అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడతగా ఒక ఎకరం కలిగిన రైతుల ఖాతాల్లోకి సిఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమం ద్వారా నగదును విడుదల చేయనున్నారు. తొలి విడతలో 70లక్షల మంది రైతులకు ఎకరం వరకు రూ.3,590 కోట్లు నిధులను విడుదల చేస్తారు. ఏప్రిల్ నెల రెండో వారంలో రెండో విడతలో రూ.3.65 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఏప్రిల్ నెల చివరి నాటికి మూడో విడతలో రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. మొత్తం మూడు విడతల్లో 1.50కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.9వేల కోట్లను రైతు భరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: