📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rythu Bharosa Funds: 22న యాసంగి రైతు భరోసా పంపిణీ

Author Icon By Tejaswini Y
Updated: March 16, 2026 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rythu Bharosa Funds: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్నికల వాగ్దానంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించ నున్నారు. తొలి విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. గత కొంతకాలంగా ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట వేదికగా యాసంగి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.

Read Also:TN Elections 2026: విజయ్‌కు బీజేపీ బంపర్ ఆఫర్.. 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి?

Rythu Bharosa Funds: Yasangi Rythu Bharosa distribution on 22nd

రేవంత్ రెడ్డి ఈ పర్యటన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా మొదటి విడత నిధులను అధికారికంగా విడుదల చేస్తారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా ఎకరం లోపు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. గత ప్రభుత్వం అందించిన రైతుబంధు స్థానంలో, పెంచిన పెట్టుబడి సాయంతో రైతు భరోసాను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధుల విడుదల ద్వారా సాగు పనులకు అవసరమైన ఖర్చుల కోసం రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది. కాగా.. రైతులకు పంటల సాగు సమయంలో ఆర్ధికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతీయేటా రెండు విడతల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రబీ సీజన్కు సంబంధించి జనవరిలో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ పంచాయతీ, మున్నివల్ ఎన్నికల కారణంగా అలస్యమయింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని తెలిపిన విషయం తెలిసిందే.

రైతుల ఖాతాల్లోకి రూ.3,590 కో

ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 22న మొదటి విడతలో సుమారు రైతుల ఖాతాల్లోకి రూ.3,590 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ఒక ఎకరం వరకు ఉన్న రైతులకు ఈ విడతలో రైతు భరోసా నిధులు అందనున్నాయి. మొదటి విడత విడుదలైన 20 రోజుల తర్వాత రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ దశలో సుమారు రూ.2,650 కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అలాగే ఏప్రిల్ నెలాఖరులోగా మూడో విడత నిధులను కూడా విడుదల చేసి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష ్యంగా పెట్టుకుంది. మూడు విడతల్లో కలిపి దాదాపు రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులు రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

rythu bharosa Rythu Bharosa Funds Rythu Bharosa Funds Release Date 2026 RythuBanduStatus YasangiSeason

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.