📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

RTC: ఆర్టీసీ సమ్మెపై ఎస్మా ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధం

Author Icon By Sharanya
Updated: May 6, 2025 • 4:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ మరోసారి సమ్మెను ఎదుర్కొంటోంది. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం, మరియు ఆర్టీసీ యాజమాన్యం మధ్య చర్చలు సాగుతున్నా విభేదాలు తొలగకపోవడం వల్ల ఈ అర్ధరాత్రి నుంచే సమ్మె ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దాదాపు 6000 బస్సులు రోడ్లపైకి రాకపోవచ్చు అనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులకు ఇది తీవ్రమైన ఇబ్బందుల‌ను కలిగించనుంది.

కార్మికుల డిమాండ్లు – ప్రభుత్వ స్పందన

తెలంగాణ ఆర్టీసీలో సమస్యల పరిష్కారం కోసం జేఏసీ బుధవారం నుంచి సమ్మెలోకి దిగుతోంది. సమ్మెను విజయవంతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా 21 సమస్యలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సమ్మెకు దిగుతున్నామని జేఏసీ నేతలు చెబుతున్నారు. మరోవైపు సమ్మె వద్దని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో పలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రితో చర్చించాయి. సమ్మె వద్దని ప్రభుత్వం చెబుతుండగా, చేసి తీరుతామని జేఏసీ నేతలు పట్టుబడ్టారు. మరోవైపు సమ్మె కట్టడి చర్యల్లో భాగంగా సమ్మెకు వెళితే ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరికలు జారీ చేసింది.

జేఏసీ, టీఎంయూ మధ్య భిన్నాభిప్రాయాలు

ప్రభుత్వంతో చర్చలు సమస్యలపై జేఏసీ చర్చించి పరిష్కరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. పలు సంఘాల నాయకులతో సమావేశం అనంతరం మంత్రి మట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు విని, పరిష్కరించేందుకు తనతోపాటు, ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమ, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. 16 నెలల్లో ఆర్టీసీకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామన్నారు. ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్‌ మొత్తం రూ. 400 కోట్లు చెల్లించామని చెప్పారు. పీఎఫ్‌ ఆర్టీనైజేసన్‌ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ. 1039 కోట్లు చెల్లించామన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు కొత్తగా 3038 ఉద్యోగాల భర్తీ చేశామని చెప్పారు. సమ్మెకు పట్టుబడకుండా చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్మా చట్ట ప్రయోగం

సమ్మెను అడ్డుకోవడానికి ఆర్టీసీ యాజమాన్యం ఎస్మా ప్రయోగించనుందన్న హెచ్చరిక తీవ్రతరం చేసింది. ఎస్మా చట్ట ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని యాజమాన్యం ప్రకటించింది. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమైనదని, సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించింది. ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థకు సమ్మె తీరని నష్టం కలిగిస్తుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. సమ్మె వల్ల సంస్థకు నష్టం వాటిల్లుతుందని, ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితమై సమ్మెకు వెళ్తే సంస్థతోపాటు ఉద్యోగులకు నష్టం జరుగుతుంద న్న విషయం మర్చిపోవద్దని సూచించింది. దీంతో, ఈ రాత్రి వరకు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Read also: Telangana: ఈ నెల 15 నుంచి తెలంగాణలో సరస్వతీ పుష్కరాలకు ఏర్పాట్లు

#ESMA #PublicTransport #RTCStrike #RTCUnion #RTCUpdates #telangana #TGSRTC Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.