हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

RS Praveen Kumar: చంద్రబాబు పై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు

Sharanya
RS Praveen Kumar: చంద్రబాబు పై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) ప్రముఖ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్ర స్థాయిలో స్పందించారు. మహా న్యూస్ కార్యాలయంపై దాడి జరిగిందని ఆరోపణలు రాగానే ఖండనలు గుప్పిస్తున్న నేతలు, గతంలో జరిగిన ఘటనలను ఎందుకు విస్మరించారని ఆయన నిలదీశారు.

కేటీఆర్, చంద్రబాబు లాంటి వాళ్లకు సమానమైన ప్రమాణాలు ఉండాలేమో?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చంద్రబాబులా దొడ్డిదారిలో రాజకీయాల్లోకి రాలేదు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాడి, ఇప్పటికీ ఉద్యమ సంబంధిత కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు ఆయన అని అన్నారు. అలాంటి కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మహా న్యూస్ అభ్యంతరకర థంబ్‌నెయిల్స్ పెట్టినప్పుడు చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు.

ఒకరికి ఒక న్యాయం – మరొకరికి మరో న్యాయమా?”

ఈ సందర్భంలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ, నేతల తీరును ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. “గతంలో టీడీపీ కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ మీడియా సంస్థపై దాడి చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు మహా న్యూస్‌పై దాడి జరిగిందని తెలియగానే పవన్ కల్యాణ్, చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీపీఐ నేతలు ఖండిస్తున్నామని అరవడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకో న్యాయం, కేటీఆర్‌కో న్యాయమా?” అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.

తన కుటుంబంపై వచ్చినప్పుడు ఏడవడం, ఇతరులపై మౌనం ఎందుకు?

అసెంబ్లీలో తన భార్యను వైసీపీ నేత కొడాలి నాని దుర్భాషలాడిన ఘటనపై చంద్రబాబు స్పందిస్తూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని గుర్తు చేసిన ప్రవీణ్ కుమార్, తన కుటుంబం విషయంలో అంతలా స్పందించిన చంద్రబాబు, కేటీఆర్ వ్యక్తిత్వ హననం జరుగుతున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? అని నిలదీశారు.

Read also: Narendra Modi: మిల్లెట్ బిస్కెట్ల తయారీలో భద్రాద్రి మహిళలకు ప్రధాని మోదీ అభినందనలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870